పిక్ టాక్: చీరల్లో సుందరీమణులు మెరిస్తే..

పిక్ టాక్: చీరల్లో సుందరీమణులు మెరిస్తే..

ఎంత ఆధునిక‌త ప‌ర‌వ‌ళ్లు తొక్కుతున్నా చీర స్థానాన్ని ఏ వెస్ట్ర‌న్ వేర్ ఆక్ర‌మించ‌లేక‌పోయాయి. జీన్స్ కు ఓటేస్తున్న ఈ కాలం యువ‌త‌... వేడుక‌ల విష‌యానికి వ‌స్తే చీర‌లనే ఎంచుకుంటున్నారు. ఇక మ‌న స్టార్ హీరోయిన్లు చీర‌లు చుట్టుకుని కుంద‌న‌పు బొమ్మ‌ల్లా మెరిసిపోతున్నారు. ర‌విక ఎన్ని రూపాలు మార్చుకున్నా చీర‌క‌ట్టు మాత్రం అదే. ప్రాచీన కాలం నాటి సంప్ర‌దాయానికి నిలువెత్తు నిద‌ర్శ‌న‌మైన చీర‌ను చుట్టిన ముద్దుగుమ్మ‌లు వీరంతా. తాజాగా వీరంద‌రి చీర‌క‌ట్టు కెమెరాకు చిక్కింది. చీర‌లో సుందరీమణులు ఆహా అంటూ మెరుపులు మెరిపించారు.

స‌మంత - ఎంత స‌క్క‌గున్నావే అంటూ రంగ‌స్థలంలో ఇప్ప‌టికే ఈ రామ‌ల‌క్ష్మిని అందంగా వ‌ర్ణించేశాడు హీరో. ఇక ఎంత చెప్పుకున్నా త‌క్కువే. రంగ‌స్థ‌లం స‌క్సెస్ మీట్లో చీర క‌ట్టులో స‌మంత త‌ళుక్కుమంది. సింపుల్ చీర‌లో వెరైటీ బ్ల‌వుజులో పొట్టి హెయిర్ క‌ట్ పిల్ల అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. అనితా డోంగ్రే డిజైన్ చేసిన బ్లూ క‌ల‌ర్ జార్జెట్ చీర సామ్ అందాన్ని రెట్టింపు చేసింది.

త‌మ‌న్నా భాటియా - పాల‌నుర‌గ లాంటి రంగున్న పిల్ల త‌మ‌న్నా.. ప్లెయిన్ ప‌సుపు రంగు చీర‌లో డిజైన‌ర్ బ్లౌజుల్లో అందంగా ఉంది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో అలా దర్శనమిచ్చి ఫిదా చేసింది.

లావ‌ణ్య త్రిపాఠి- చీర‌లో డిజైన్‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా లావ‌ణ్య చీర‌క‌ట్టు ఆమెను మ‌నోహ‌రంగా చూపిస్తోంది. తెల్ల‌ని చీర‌పై ప‌సుపు రంగు పూలు లావ‌ణ్య మేని వ‌ర్ణానికి అందంగా న‌ప్పేశాయి.

తాప్సీ ప‌న్ను - తాజాగా జ‌రిగిన ఓ ఈవెంట్‌కు తాప్సీ ప్లెయిన్ బ్లూ చీర‌లో చెవుల‌కు పెద్ద బంగారు జుంకాల‌తో వ‌చ్చింది. మెడ‌లో చిన్న చైను కూడా వేసుకోక‌పోయినా... చెవుల‌కు పెట్టిన జుంకాలు... చీర ఎంతో అందాన్ని తెచ్చిపెట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English