జురాసిక్ వరల్డ్.. మైండ్ బ్లాంకయ్యేలా ఉందే

జురాసిక్ వరల్డ్.. మైండ్ బ్లాంకయ్యేలా ఉందే

ప్రపంచ సినీ చరిత్రలోనే ఆల్ టైం గ్రేట్ సినిమాల జాబితా తీస్తే అందులో ‘జురాసిక్ పార్క్’ తప్పకుండా ఉంటుంది. 90ల్లో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. దీనికి కొనసాగిపుగా ‘జురాసిక్ పార్క్: ది లాస్ట్ వరల్డ్’.. ‘జురాసిక్ పార్క్-3’.. ‘జురాసిక్ వరల్డ్’ సినిమాలు వచ్చాయి. అవి కూడా ఆదరణ పొందాయి. ఇప్పుడు ఈ వరుసలో ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్ డమ్’ రాబోతోంది. జూన్ 7న రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు ఆ ఆసక్తిని మరిన్ని రెట్లు పెంచేలా కొత్త ట్రైలర్ ఒకటి లాంచ్ చేశారు.

ఇందులోని విజువల్స్ చూస్తే కళ్లు చెదిరిపోవడం ఖాయం. గత ‘జురాసిక్’ సిరీస్‌ను తలదన్నేలా ఇందులో అద్భుతమైన విజువల్స్ ఎపెక్ట్స్ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ప్రతి దృశ్యం కళ్లు చెదిరిపోయేలా ఉంది ఈ ట్రైలర్లో. అత్యంత ప్రమాదకరమైన రాకాసి బల్లిని బంధించి దాని ద్వారా ప్రయోజనం పొందాలని ఒక గ్రూప్ ప్రయత్నిస్తుంటే.. రాకాసిబల్లికి మేలు చేయాలనే ప్రయత్నంలో హీరో ఉంటాడు. తనను కెలికిన మానవుల్ని రాకాసి బల్లి ఎలా ఆటాడుకుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్లోని దృశ్యాలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఇక ఐమాక్స్ త్రీడీలో ఈ సినిమా చూస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం. జె.ఎ.బయోనా రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తుందనే అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు