ఒక్క దర్శకుడు.. 66 వేల కోట్ల కలెక్షన్లు

ఒక్క దర్శకుడు.. 66 వేల కోట్ల కలెక్షన్లు

‘బాహుబలి: ది కంక్లూజన్’ వెయ్యి కోట్ల వసూళ్ల మార్కును టచ్ చేయగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. నోరెళ్లబెట్టి చూసింది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.1700 కోట్ల మార్కును కూడా దాటింది. ఆ తర్వాత ‘దంగల్’ చైనాలో వసూళ్ల మోత మోగించి ఓవరాల్ వసూళ్లలో ఏకంగా రూ.2 వేల కోట్ల మార్కును అందుకుని సంచలనం సృష్టించింది. ఇదీ నమ్మశక్యంగా అనిపించలేదు మన జనాలకు. ఐతే హాలీవుడ్ సినిమాలు ఎప్పట్నుంచో వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. అక్కడ ఒక స్టార్ డైరెక్టర్ తాను తీసిన సినిమాలతో ఏకంగా 66 కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం విశేషం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. స్టీఫెన్ స్పీల్ బర్గ్. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా పేరుగాంచిన స్టీఫెన్ స్పీల్ బర్గ్ తాజాగా ‘రెడీ ప్లేయర్ వన్’ అనే సినిమా రూపొందించాడు.

ఈ చిత్రం ఇటీవలే 500 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3,300 కోట్లు) వసూలు చేసింది. ఒలివియా కూక్.. టై షెరీడాన్.. బెన్ మెన్డెల్సోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది. అదిరిపోయే టాక్‌తో మొదలైన ఈ చిత్రం ఆరంభం నుంచి భారీ వసూళ్లు సాధిస్తూ వస్తోంది. తాజాగా ఆ చిత్ర వసూళ్లు 500 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా స్పీల్ బర్గ్ సినిమాల వసూళ్లన్నీ కలిపితే బిలియన్ డాలర్లకు చేరాయి. అంటే దాదాపు 66 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచ సినీ చరిత్రలో ఏ దర్శకుడూ 10 బిలియన్ మార్కును అందుకోలేదు. ఇది స్పీల్‌బ్గర్‌కు మాత్రమే సాధ్యమైన ఘనత.. చరిత్ర. ‘జురాసిక్ పార్క్’ సహా ఎన్నో అద్భుత చిత్రాలు అందించిన ఘనత ఆయన సొంతం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు