‘స్పైడర్’లో ఏం తప్పు జరిగిందో చెప్పిన మహేష్

‘స్పైడర్’లో ఏం తప్పు జరిగిందో చెప్పిన మహేష్

మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలుస్తుందని ‘స్పైడర్’ మీద అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. తిరుగులేని ట్రాక్ రికార్డున్న మురుగదాస్‌తో మహేష్ జట్టు కట్టడంతో ఆ సినిమాపై ధీమాగా ఉన్నారు. ఎప్పుడూ తన సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడని మురుగదాస్ కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టరే అని తీర్పిచ్చాడు. కానీ చివరికి ఫలితం తేడా కొట్టేసింది.

మహేష్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఎందుకు అలా అయిందో మహేష్‌కు ఆలస్యంగా తెలిసొచ్చింది. తమిళంలో మార్కెట్ సంపాదించుకోవడం కోసం ద్విభాషా చిత్రంగా ‘స్పైడర్’ను చేయాలనుకోవడమే తాము చేసిన అతి పెద్ద తప్పని మహేష్ అన్నాడు.

తమిళ నేటివిటీకి తగ్గట్లుగా సినిమాను మార్చే క్రమంలో అక్కడి నటీనటులు చాలా మందిని ఈ సినిమాలోకి తీసుకున్నామని.. అలాగే కథను కూడా అక్కడి జనాల అభిరుచికి తగ్గట్లు మార్చామని.. మరిన్ని అంశాలు అలాగే జోడించామని.. దీంతో మన ప్రేక్షకుల అభిరుచికి దూరంగా సినిమా తయారైందని మహేష్ చెప్పాడు. మన ప్రేక్షకులు కోరుకున్నట్లుగా హీరో ఎలివేషన్ ఇందులో కనిపించలేదని మహేష్ తెలిపాడు.

తాము తప్పు గుర్తించేసరికే ఆలస్యం అయిపోయిందని మహేష్ చెప్పాడు. తాను ప్రయోగాలు చేసి చేసి అలసిపోయానన్న మహేష్.. ఇకపై అభిమానుల్ని దృష్టిలో ఉంచుకునే సినిమాలు చేస్తానని ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసేందే. ‘స్పైడర్’ ఫెయిల్యూర్ గురించి చెబుతూ ఆ విషయాన్నే మరోసారి నొక్కి వక్కాణించాడు ప్రిన్స్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు