నెల కిందటే వర్మను అలా పొగిడి...

నెల కిందటే వర్మను అలా పొగిడి...

రామ్ గోపాల్ వర్మ గతంలో ఎన్ని వివాదాల్లో వేలు పెట్టినా.. ఆయన గత చరిత్రను, ఘనతల్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖులెవరూ ఏమీ అనలేదు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డితో బూతు తిట్టించడంతో వర్మ విషయంలో అందరి అభిప్రాయం మారిపోయింది. ఆయన్ని తిట్టనివాళ్లు లేరు. అల్లు అరవింద్ ఏకంగా వర్మను.. నీచుడు, నికృష్టుడు, తక్కువ రకం మనిషి అంటూ తీవ్రంగా దుయ్యబట్టాడు.

నిజానికి వర్మ చాలా ఏళ్ల నుంచి మెగా హీరోల్ని.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నప్పటికీ నాగబాబు మినహా ఎవ్వరూ సంయమనం కోల్పోలేదు. అల్లు అరవింద్ సైతం మామూలుగానే ఉన్నారు. నెల కిందటే వర్మను ఓ కార్యక్రమంలో అరవింద్ పొగడ్డం విశేషం.

శ్రీదేవి మరణించిన సందర్భంలో వర్మ తీవ్ర భావోద్వేగంతో ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. అది చూసి అరవింద్ కూడా కదిలిపోయాడు. శ్రీదేవి సంస్మరణ సభలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. వర్మను అందరూ ఏదో అనుకుంటాం కానీ.. శ్రీదేవిపై అతడి ప్రేమ ఎలాంటిదో ఈ లేఖ చూస్తే అర్థమవుతుందని.. అతను ఎంత బాగా లేఖ రాశాడో అని అరవింద్ కితాబివ్వడం విశేషం.

అంతకుముందు మెగా హీరోల విషయంలో వర్మ వ్యాఖ్యల్ని మనసులో పెట్టుకోకుండా ఆ సందర్భంలో అతడిని పొగిడిన అరవింద్.. ఇప్పుడు మాత్రం పట్టరాని కోపంతో ఊగిపోయారు. 15 నిమిషాలకు పైగా కేవలం వర్మనే టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అతడిని ఇండస్ట్రీ నుంచే తరిమేయాలన్నట్లు మాట్లాడాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English