బీఎఫ్‌ని హీరోని చేసేస్తోందట

బీఎఫ్‌ని హీరోని చేసేస్తోందట

విఘ్నేష్‌ శివన్‌కి దర్శకుడిగా పేరున్నా ఒక హీరోకుండే ఫేస్‌ వేల్యూ లేదు. తాను పెళ్లాడే వాడికి స్టార్‌గా కూడా స్టేటస్‌ వుండాలని అనుకుందో ఏమో అతడిని హీరోగా లాంఛ్‌ చేయడానికి నయనతార ప్రయత్నాలు ప్రారంభించింది. అతను రాసిన ఒక కథకి హీరోని వెతుకుతోంటే 'ఈ పాత్రకి నువ్వయితేనే బాగుంటుంది' అంటూ నయనతార అతడిని ప్రోత్సహించిందట.

నిర్మాతలకి కూడా అతను హీరో అయితేనే చేస్తానని తేల్చి చెప్పిందట. నయనతార పట్టుబట్టడంతో నిర్మాతలు కాదనలేకపోయారు. ఇంతకాలం యాక్షన్‌ అనడమే తప్ప చేయడం ఎరుగని విఘ్నేష్‌ ప్రస్తుతం ఒక కోచ్‌ని పెట్టుకుని నటనలో మెలకువలు నేర్చుకుంటున్నాడట. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అనుకుంటోన్న ఈ జంట ఇప్పుడు కొత్త పర్వం మొదలు పెట్టడంతో పెళ్లి వాయిదా పడినట్టే కనిపిస్తోంది. నయనతారకి గతంలోని ప్రేమ వ్యవహారాలు పెళ్లి వాయిదా పడినపుడు బెడిసికొట్టాయి.

ఆ సెంటిమెంట్‌ భయం కూడా లేకుండా బాయ్‌ఫ్రెండ్‌ని హీరోని చేసి తీరాలని ఆమె కంకణం కట్టుకుంది. మరి హీరోగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ ఎంత సక్సెస్‌ అవుతాడనేది కాలమే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు