ఇరకాటంలో నాగార్జున!

ఇరకాటంలో నాగార్జున!

రాంగోపాల్‌వర్మతో మిగతా ఇండస్ట్రీ వృత్తిగత సంబంధాలు తెంచేసుకుని చాలా కాలమవుతోంది. దాదాపుగా అందరు పేరున్న హీరోలు అతడికి దూరంగా వుంటోన్న టైమ్‌లో పాత అనుబంధంతో రాంగోపాల్‌వర్మకి ఆఫీసర్‌ సినిమా చేసి పెడుతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని వర్మ ఎలా తీర్చిదిద్దుతున్నాడనేది టీజర్‌ చూస్తేనే తెలుస్తుంది. అయినప్పటికీ వర్మ కోసమని ఈ చిత్రం గురించి ఎలాంటి నెగెటివ్‌ మాట్లాడకుండా పాజిటివ్‌ వైబ్రేషన్‌ వుండేట్టు చూసుకుంటున్నాడు నాగ్‌.

ఇదిలావుంటే అఖిల్‌తో సినిమా వుంటుందని కూడా వర్మ ప్రకటించుకున్నాడు. ఆఫీసర్‌ సినిమా అమ్ముకోవడానికే ఈ ఎత్తు వేసాడని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అయితే ఆఫీసర్‌ నిజంగా మంచి హిట్‌ అయితే అఖిల్‌తో సినిమా ఇస్తానని నాగ్‌ మాట ఇచ్చాడనేది ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే వర్మ చేసిన పిచ్చి పనికి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకమై అతడికి వ్యతిరేకమైంది. డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అతనిపై కఠిన చర్యలకి పూనుకుంటూ వుండగా, తెలుగు సినీ పరిశ్రమ అతనిపై అప్రకటిత నిషేధానికి పావులు కదుపుతోందని మరో టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వర్మకి వున్న ఏకైక కనక్షన్‌ నాగార్జున అయిపోయాడు. ఇది తెంచుకోమనే ప్రస్తుతం నాగార్జునకి ఎవరైనా సజెస్ట్‌ చేస్తారు.

స్నేహితుడి కోసం నాగ్‌ నిలబడినా కానీ మొత్తం పరిశ్రమకి వ్యతిరేకంగా వుండలేడు. ఆఫీసర్‌ రిలీజ్‌కే ఆటంకాలు ఎదురవుతాయని అనిపిస్తోన్న నేపథ్యంలో ఇక అఖిల్‌తో సినిమా కలలో మాటే. దీని గురించి నాగ్‌, అఖిల్‌ ఇద్దరిలో ఎవరూ అఫీషియల్‌గా కమిట్‌ కూడా కాలేదు. తనకి డిఫెండ్‌ చేసే ఛాన్స్‌ కూడా ఇవ్వకుండా కార్నర్‌ అయిపోయిన వర్మ విషయంలో నాగార్జున కూడా సైలెంట్‌గానే వుంటాడని, ఎలాంటి యాక్షన్‌ తీసుకున్నా అడ్డు చెప్పడనే చెప్పుకుంటున్నారు. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు