'నాకేంటి' అనే అతి కొంత ముంచింది

'నాకేంటి' అనే అతి కొంత ముంచింది

దేనికైనా హద్దు అంటూ వుంటుంది. హద్దులు తెలుసుకోకుండా మితి మీరితే మొదటికే మోసం వస్తుందని బహుశా రాంగోపాల్‌వర్మకి ఇప్పటికి తెలిసివచ్చి వుంటుంది. ఎవరో ఒకరిపై అకారణంగా విమర్శలు చేయడం, తనకి అక్కర్లేని పంచాయితీల్లో దూరి మైలేజీ కోసం చూడడం, ముఖ్యంగా ఒక హీరో కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ పేట్రేగిపోవడం వర్మ బలహీనతలయ్యాయి. లాజిక్‌తో ఎలాంటి వాదనకి అయినా ఆన్సరిచ్చే తెలివితేటలు వుండడంతో, 'తిక్కలోడు', 'అతనితో మాట్లాడి నెగ్గలేం' అనే అభిప్రాయాలతో ఎవరూ అతనితో డిబేట్‌కి రాకపోవడంతో ఆడింది ఆట, మాట్లాడింది మాటగా చెల్లిపోయింది.

ఈ క్రమంలో తప్పులు చేసి క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టాడు. మొదట్లో దేనికీ వెరవడని అనిపించుకున్నవాడే సారీ చెప్పుకుంటూ తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే పర్సనల్‌గా ఒక శక్తివంతమైన స్టార్‌ని దూషించమని ప్రేరేపించి, తద్వారా అతని అభిమానులు సంయమనం కోల్పోయేట్టు చేయాలనే కుతంత్రం రచించి తన హద్దుని టోటల్‌గా దాటేసాడు. ఇంతకాలం మౌనంగా వున్న మెగా కుటుంబం ఎదురుదాడికి దిగింది. వర్మపై డైరెక్ట్‌ బ్యాన్‌ విధించడం కష్టం కనుక అతనికి 'నాన్‌ కోపరేషన్‌' లాంఛ్‌ చేసే పనిలో వుంది. ప్రస్తుతం వర్మ సినిమా ఆఫీసర్‌ నిర్మాణ దశలో వుంది. ఈ చిత్రానికి అతనే నిర్మాత.

దీనికి గానీ నాన్‌ కోపరేషన్‌ ఎదురైతే వర్మ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది. అంతే కాకుండా వర్మని అంటి పెట్టుకుని అతను తానా అంటే తందానా అంటూ వచ్చిన బ్యాచ్‌ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇక వారు వర్మతో సన్నిహితంగా వుండడం కష్టమే అంటున్నారు. ఏదేమైనా పబ్లిసిటీ యావలో పడి, ఒక హీరో కుటుంబంపై మితి మీరిన కక్ష పెంచుకుని కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడని, దీనిని అతను ఎలా డీల్‌ చేస్తాడో చూడాలని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English