బోయపాటిపై ఒత్తిడి తగ్గించిన చరణ్‌

బోయపాటిపై ఒత్తిడి తగ్గించిన చరణ్‌

బోయపాటితో రామ్‌ చరణ్‌ చిత్రం ఇంతవరకు సరిగ్గా పది రోజుల పాటు షూటింగ్‌ జరుపుకోలేదు. అనేక అంతరాయాలతో ఇంకా ఈ చిత్రం కుదురుగా పట్టాలెక్కలేదు. చరణ్‌ ప్రస్తుతం బాడీ బిల్డ్‌ చేసే పనిలో వున్నాడు కనుక అది పూర్తయ్యాకే షూటింగ్‌ సజావుగా జరుగుతుంది. నిజానికి ఈ చిత్రాన్ని ఆగస్టులోగా పూర్తి చేసి దసరాకి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ప్లాన్‌ మారింది. దసరాకి విడుదల చేయాల్సినంత వేగంగా పనులు చేయాల్సిన అవసరం లేదని, అంత టెన్షన్‌ పడుతూ చేయవద్దని చరణ్‌ చెప్పాడట.

దీంతో సంక్రాంతికి రిలీజ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. రాజమౌళి చిత్రం కోసం మధ్యలో కొన్నాళ్లు కేటాయించినా కానీ అక్టోబర్‌, నవంబర్‌లో కూడా బోయపాటి చిత్రానికి చరణ్‌ డేట్స్‌ ఇచ్చాడట. రాజమౌళి చిత్రం షూటింగ్‌ ట్రాక్‌ మీదకి రావడానికి ఎలాగో సమయం వుంది కనుక ఈ చిత్రాన్ని హడావిడిగా చేసేయరాదని, రంగస్థలం తర్వాత వస్తోంది కాబట్టి అంచనాలు భారీగా వుంటాయి కనుక సమయం తీసుకుని మంచి ప్రోడక్ట్‌ ఇద్దామని చరణ్‌ చెప్పడంతో బోయపాటిపై వేగంగా పూర్తి చేయాలనే ఒత్తిడి తొలగిపోయింది.

ఈ చిత్రం ఈ యేడాదిలోనే వస్తుందని అభిమానులు ఇక ఆశలు పెట్టుకోనవసరం లేదు. వచ్చే సంక్రాంతికే మెగా పవర్‌స్టార్‌ సందడి థియేటర్లలో వుంటుంది. సంక్రాంతికి చరణ్‌ ట్రాక్‌ రికార్డ్‌ చాలా బాగుంది కనుక ఇది వారికి గుడ్‌న్యూసే అనాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు