సాహో చుట్టూ కోట్ల కహానీ.. ఏది నిజం?!

సాహో చుట్టూ కోట్ల కహానీ.. ఏది నిజం?!

బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అనే ఇమేజ్ ను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. అందుకే ఈ హీరో తర్వాతి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. సాహో మూవీ విషయంలో నేషనల్ మీడియా కవరేజ్ ఉంటోంది. క్రేజ్ వరకూ ఓకే కానీ.. బిజినెస్ దగ్గరకు వచ్చేసరికే అసలు లెక్కలు అన్నీ బయటకు వస్తాయి.

ఇప్పుడు తెరకెక్కుతున్న సాహో హిందీ రైట్స్ విషయంలో బోలెడంత హంగామా జరిగి.. చివరకు టీ-సిరీస్ దగ్గర డీల్ క్లోజ్ అయింది. మొదటగా సాహోకు సౌత్ ఇండియా మినహా.. కేవలం నార్త్ ఇండియా వరకే 300 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ కుదిరిందని అన్నారు. ఆ తర్వాత ఏమైందో కానీ.. హిందీ థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ వరకూ కలిసి 120 కోట్లకు లెక్క తేలిందని అన్నారు. కరణ్ జోహార్ పేరు చాలాకాలమే వినిపించాక.. ఇప్పుడు టీ-సిరీస్ దగ్గర లాక్ అయిందంటూ అఫీషియల్ ఇన్ఫో వచ్చేసింది. కానీ టీ-సిరీస్ తో సాహో హిందీ రైట్స్ డీల్ వాల్యూ 50 కోట్లు అన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

ఇంతటి భారీ డీల్ అన్నాక అంకెలు మారడం సహజమే కానీ.. మరీ 300 నుంచి 50 వరకూ పడిపోవడం అంటే ఇదేదో అర్ధం కాని విషయమే. ఇంతకీ అసలు ఈ డీల్ వాల్యూ ఎంత అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. 150-200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న సాహోకు దేశవ్యాప్తంగా పలు భాషలలో శాటిలైట్ రూపంలోనే సగానికి సగం వచ్చేయవచ్చని ట్రేడ్ జనాలు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు