60 కోట్ల లాభాన్ని నింపేసిన భరత్

60 కోట్ల లాభాన్ని నింపేసిన భరత్

పెద్ద హీరోలతో భారీ చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలు ఎందుకు ఉత్సాహం చూపిస్తారో.. ఆయా సినిమాల బడ్జెట్ లెక్కలను చూస్తే అర్ధం అవుతుంది. ఒక్క సినిమా కరెక్టుగా పడిందంటే చాలు.. కొన్ని తరాలకు సరిపడేంత సంపాదించుకునే అవకాశాలు స్టార్ హీరోల సినిమాలతోనే వస్తాయి.

ఇప్పుడు రిలీజ్ అవుతున్న మహేష్ మూవీ భరత్ అనే నేను గురించే చెప్పుకుంటే.. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 100 కోట్లకు విక్రయించారు. శాటిలైట్ డబ్బింగ్ డిజిటల్ ఇతరాలు కలుపుకుని ఓ 40 కోట్లు వచ్చేశాయి. అంటే రిలీజ్ కి ముందే 140 కోట్ల లెక్క తేలిందన్న మాట. ఇందులో ఖర్చు ఎంత వెచ్చించి ఉంటారు అని చూస్తే.. మహేష్ బాబుకు కనీసం 20 కోట్ల పారితోషికం ముట్ట చెప్పాలి. కొరటాల కూడా ప్రస్తుతం 10 కోట్ల రేంజ్ లో ఉన్నాడు. డీల్స్ మాట్లాడినందుకు మరింతగా గిట్టిందని అంటున్నారు కానీ.. ఇది మూవీ రిలీజ్ తర్వాత హిట్టు అయ్యి లాభాలొచ్చాక మాత్రమే చేతికొస్తుంది. సో ఆ పాయింట్ పక్కన పెట్టచ్చు.

ఇక సినిమాను ఎంత కాస్ట్ లీగా తెరకెక్కించినా.. ఇతర యాక్టర్లు టెక్నీషియన్ల పారితోషికాలు.. ప్రొడక్షన్ ప్లస్ పబ్లిసిటీ కలిపి ఓ 50 కోట్లు వరకూ ఖర్చు ఉంటుంది. అంటే మొత్తం 80 కోట్ల వరకూ ఖర్చు అయే ఛాన్స్ ఉంది. మిగిలిన 60 కోట్లు అప్పుడే మిగులు కళ్ల జూసినట్లే. దీనిలోంచి వడ్డీ లెక్కలు పోను మిగిలింది లాభమే. సినిమా సక్సెస్ రేంజ్ అనుసరించి.. మెజారిటీ పోర్షన్ నిర్మాతకు పోగా ఇంకా ఏమైనా మిగిలితే హీరో-దర్శకుడికి షేర్ వస్తుందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు