‘మా’కు మంచు విష్ణు పంచ్

‘మా’కు మంచు విష్ణు పంచ్

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్.. శ్రీరెడ్డి గొడవకు సంబంధించి ఇండస్ట్రీ జనాల్లో బాగానే కదలిక కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి బూతు తిట్టడంపై పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆల్రెడీ జీవిత.. నాగబాబు.. అల్లు అరవింద్ తదితరులు ఈ వ్యవహారంపై ఓపెనయ్యారు. తాజాగా మంచు విష్ణు ఈ విషయమై స్పందించాడు. ఈ గొడవలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ తీరును తప్పుబడుతూ మంచు విష్ణు లేఖాస్త్రం సంధించాడు. శ్రీరెడ్డి గొడవను ‘మా’ సరిగా హ్యాండిల్ చేయలేదని విష్ణు అభిప్రాయపడ్డాడు.

తప్పు చేసిన వాళ్లను శిక్షించే అధికారం ‘మా’కు ఉందని.. ఐతే ‘మా’లో సభ్యురాలు కాని వ్యక్తిపై హడావుడిగా ముందు నిషేధం విధించి.. ఇండస్ట్రీలో కొందరు పెద్దలపై ఆమె ఆరోపణలు చేయగానే అంతే హడావుడిగా నిషేధం ఎత్తివేడయంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని.. దీని వల్ల ‘మా’ పరువు పోయిందని విష్ణు అన్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో తెలుగు సినిమాపై చులకన భావం ఏర్పడిందని విష్ణు అభిప్రాయపడ్డాడు. అయినా ఒక నటితో 900 మంది ‘మా’ సభ్యులు నటించొద్దని ఎలా ఆంక్షలు విధిస్తారని విష్ణు ప్రశ్నిస్తాడు. ఒక నటుడిగా ఎవరితో కలిసి పని చేయాలి.. ఎవరితో చేయకూడదని నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని.. ‘మా’లో సభ్యత్వం లేని వాళ్లు కూడా చాలామందితో తాను పని చేశానని విష్ణు అన్నాడు. ‘మా’ ఒక నియమావళి రూపొందించి అందరూ దాన్ని పాటించేలా చూడాలని విష్ణు సూచించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English