కత్తి మహేష్ ఓ ఛీటర్ అంటున్న ఎన్ఆర్ఐ

కత్తి మహేష్ ఓ ఛీటర్ అంటున్న ఎన్ఆర్ఐ

ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో నిలిచే వ్యక్తి కత్తి మహేష్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ పైన.. అతడి అభిమానులపైన వరస ఆరోపణలు చేసి టీవీ ఛానల్స్ లో డిబేట్లలో పాల్గొని బాగానే పాపులరయ్యాడు. ఒకానొక దశలో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లిన వివాదాలు చివరకు సర్దుబాటు అయ్యాయి. అయినా అడపాదడపా కత్తి మహేష్ కామెంట్లు చేస్తూనే వస్తున్నాడు.

ఇంతవరకు కొత్తకొత్త ఆరోపణలతో వివాదాలకు తెర తీసిన కత్తి మహేష్ ఇప్పుడు స్వయంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. కత్తి మహేష్ ఓ పెద్ద ఛీటర్ అంటూ ఓ ఎన్ఆర్ఐ ఆరోపణ చేశారు. ప్రస్తుతం యూఎస్ లో నివాసం ఉంటున్న అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన డాక్టర్ ఇస్మాయిల్ సొహైల్ ఈ ఆరోపణలు చేశారు. ప్రఖ్యాత రచయిత చలం రచనలపై షార్ట్ ఫిలిం తీస్తానని చెప్పి కత్తి మహేష్ తన వద్ద లక్ష రూపాయలు తీసుకున్నాడనేది ఇస్మాయిల్ మాట. డబ్బు తీసుకున్న తరవాత కత్తి మొహం చాటేశాడని.. షార్ట్ ఫిలిం మాటే ఎత్తలేదని.. తాను కాంటాక్ట్ అవుదామని ప్రయత్నించినా దొరక్కుండా తిరుగుతున్నాడని ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియో తీసి ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

కత్తి మహేష్ ను వివాదం చుట్టుముట్టడం కొత్తేమీ కాదు. ఈ మధ్య ఓ మహిళ అతడు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆరోపించింది. అయితే కత్తి మహేష్ దీనిని ఖండించడమే కాక.. ఆమెపై కేసు వేస్తానని చెప్పుకొచ్చాడు. మరి ఈ ఎన్ఆర్ఐ మాటలకు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు