రామలక్ష్మి సక్సెస్ లో ఈమెకీ వాటా ఉంది

రామలక్ష్మి సక్సెస్ లో ఈమెకీ వాటా ఉంది

రంగస్థలం మూవీకి రామ్ చరణ్ యాక్టింగ్ మెయిన్ అట్రాక్షన్ పాయింట్ అయినా.. ఈ చిత్రంలో ప్రతీ సన్నివేశం.. ప్రతీ పాత్ర.. ప్రతీ యాక్టర్.. టెక్నీషియన్ చాలా కీలకం. రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత ఏ స్థాయిలో మెప్పించిందో ఇప్పటికే చూసి తరించేశాం. అయితే.. ఆమె రోల్ అంతగా పండడం.. ఆ పాత్రకు అంతగా పేరు రావడంలో కొంత క్రెడిట్ ను డబ్బింగ్ ఆర్టిస్ట్ జ్యోతి వర్మకు కూడా ఇవ్వాలి.

దాదాపు 100 చిత్రాలలో లీడింగ్ హీరోయిన్స్ సహా పలువురికి తన వాయిస్ ఇచ్చిన జ్యోతి వర్మ.. వేదం మూవీలో అనుష్కకు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇప్పుడు రంగస్థలం మూవీలో సమంత పాత్రకు వాయిస్ ఇవ్వడంతో ఈమె కెరీర్ మరిన్ని మెట్లు ఎక్కేసింది. ఆమె గురించి ఆమె ట్యాలెంట్ గురించి మరింత మందికి తెలిసింది. సహజంగా సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. ఆమె లేకుండా సామ్ మూవీ ఊహించుకోలేం అనిపించేంతగా చిన్మయి గొంతుకు జనాలు అలవాటు పడ్డారు. అయితే.. రంగస్థలం మూవీలో మాత్రం క్యారెక్టర్ కి తగినట్లుగా మార్చాలని భావించారు.

మొదటగా ట్రాక్ డబ్బింగ్ కోసమే జ్యోతి వర్మను తీసుకున్నారట. కానీ జ్యోతి వర్మ ట్యాలెంట్ ను చూసి మెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. సినిమాకు కూడా ఆమెతోనే డబ్బింగ్ చెప్పాలని సూచించాడట. డైరెక్షన్ టీం అంతా సపోర్ట్ చేయడంతో.. చివరకు అలా జరిగిపోయిందని అంటోంది జ్యోతి వర్మ. ఈమె నేటివ్ ప్లేస్ పోలవరం కావడంతో.. తనకు ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరింత సులువు అయిందని చెబ్తోంది జ్యోతి వర్మ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English