క్యాస్టింగ్ కౌచ్‌.. రమ్య ఏమందంటే..

క్యాస్టింగ్ కౌచ్‌.. రమ్య ఏమందంటే..

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ని ఊపేస్తున్న స‌మస్య క్యాస్టింగ్ కౌచ్‌. శ్రీరెడ్డి రోడ్డు మీద‌కి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇష్యూ రోజు రోజుకి దుమారం రేపుతోంది. కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌచ్ ఉందంటే... కొంద‌రు మాత్రం అలాంటిదేం లేదంటూ కొట్టి ప‌డేస్తున్నారు. మ‌ళ‌యాళ హీరోయిన్ ర‌మ్య నంబీశ‌న్ మాత్రం త‌న‌కు తెలిసిన విష‌యాన్ని ధైర్యం బ‌య‌ట‌పెట్టింది.

క్యాస్టింగ్ కౌచ్ బారిన తాను ప‌డ‌లేద‌ని కానీ సినీ ఇండ‌స్ట్రీలో ఆ చెత్త పోక‌డ ఉంద‌ని చెప్పింది. త‌న స్నేహితురాళ్లే క్యాస్టింగ్ కౌచ్‌కు గుర‌య్యార‌ని ఆ విష‌యాలు త‌నతో చెప్పుకుని చాలా ఆవేద‌న చెందార‌ని చెప్పింది. త‌న‌కు అలాంటి ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌నంత మాత్రాన అది లేద‌ని చెప్ప‌న‌ని అంది. క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఘ‌ట‌న‌లు త‌న జీవితంలో జ‌రిగితే ఎలా స్పందించాలో తెలుస‌ని త‌న‌కు ఏం కావాలో ఏం వ‌ద్దో నిర్ణ‌యించుకునే ధైర్యం ఉంద‌ని చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా బ‌య‌టికి మాట్లాడ‌గ‌లిగితేనే ఆ పోక‌డ త‌గ్గుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అది కేవలం సినిమా ప‌రిశ్ర‌మ‌లోనే కాదు ప్ర‌తి చోటా ఉంద‌ని మ‌హిళా ధైర్యంగా పోరాడాల్సిందేన‌ని చెప్పుకొచ్చింది.

శ్రీరెడ్డి త‌న‌ను వాడుకుని సినిమా అవ‌కాశాలు ఇవ్వ‌కుండా మోసం చేశార‌ని టీవీ ఛానెళ్ల‌లో ర‌చ్చ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఫిల్మ్ ఛాంబ‌ర్ ఎదుట అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న కూడా చేసింది. దీంతో జాతీయ‌స్థాయిలో ఈ విష‌యంపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. త‌మిళ మ‌ళ‌యాళ ప‌రిశ్ర‌మ‌ల‌లోని న‌టీమ‌ణులు కూడా స్పందించ‌డం మొద‌లుపెట్టారు. ఒక్క తెలుగులోనే కాదు అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌లు అలాగే ఉన్నాయ‌ని ఆరోపిస్తున్నారు. కానీ హీరోయిన్‌గా మంచి స్థాయిలో ఉన్న ఏ అమ్మాయి ఇంత‌వ‌ర‌కు నోరు విప్ప‌లేదు. ర‌మ్య నంబీశ‌న్ ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడ‌డం ఇప్పుడు కోలీవుడ్ మాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పిజ్జా సినిమాలో హీరోయిన్‌గా చేసింది ర‌మ్య‌. అలాగే తెలుగులో అందమైన మనసులో.. సారాయి వీర్రాజు.. నువ్విలా వంటి సినిమాల్లోనూ నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English