శ్రీరెడ్డి గొడవపై అరవింద్ గొప్పగా మాట్లాడారు

శ్రీరెడ్డి గొడవపై అరవింద్ గొప్పగా మాట్లాడారు

టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి పెద్ద గొడవే నడుస్తోంది కొన్ని రోజులుగా. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. పవన్ ను ఆమె తిట్టడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. పవన్ అన్నయ్య నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు ఈ వ్యవహారంపై మాట్లాడారు. తాజాగా మెగా ఫ్యామిలీ పెద్ద అల్లు అరవింద్ ఈ వ్యవహారంపై ఎవ్వరూ అడక్కుండానే స్పందించారు. తన ప్రొడక్షన్లో వస్తున్న కొత్త సినిమా ‘టాక్సీవాలా’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన దీనిపై మాట్లాడారు.

ఆరు నెలల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాతో తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిందని.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏంటీ తెలుగు సినిమా అని మనవైపు చూశారని.. మన సినిమాకు ఎనలేని గుర్తింపు వచ్చిందని.. ఇది అందరూ గర్వపడాల్సిన విషయమని అరవింద్ అన్నారు. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమా గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నారని అరవింద్ అన్నారు. కొంతమంది చేసే తప్పుల్ని మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించి పరువు తీయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాస్టింగ్ కౌచ్ అనేది చిన్న సమస్య అని.. అది ఇండస్ట్రీలో అసలేమాత్రం లేదని తాను అననని.. కానీ దీని గురించి ఇలా రోడ్డు మీదికి వచ్చి మాట్లాడటం ద్వారా మన పరువును మనమే తీసుకుంటామా అని ఆయన ప్రశ్నించారు. దీని గురించి గొడవ చేస్తున్నవాళ్లతో సహా అందరూ ఈ ఇండస్ట్రీని నమ్ముకునే బతుకుతున్నామని.. ఈ ఇండస్ట్రీలోనే భోజనం చేస్తున్నామని.. అలా చేస్తూ ఈ ఇండస్ట్రీని చిన్నబుచ్చేలా వ్యవహరించడం కరెక్టా అని ఆయన ప్రశ్నించారు. మీడియా వాళ్లతో సహా అందరికీ తాను చేసే విన్నపం ఒకటే అని.. మన ఇండస్ట్రీ పరువును మనమే తీయొద్దని ఆయన చేతులెత్తి నమస్కరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English