కోలుకుని కళ్యాణానికి వెళ్లిపోయాడు

కోలుకుని కళ్యాణానికి వెళ్లిపోయాడు

సినిమా సక్సెస్ అయితే హీరోలు ఎంత జోష్ చూపిస్తారో.. ఒక వేళ ఫ్లాప్ అయితే మాత్రం అంతకగా కుంగిపోతారు. కొందరు స్టార్ హీరోలకు కూడా ఫ్లాపుల నుంచి కోలుకునేందుకు టైం పడుతూ ఉంటుంది. కానీ నితిన్ మాత్రం తాను ఇందుకు భిన్నం అని నిరూపించుకుంటున్నాడు.

నితిన్ రీసెంట్ మూవీ ఛల్ మోహన రంగపై చాలానే అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు వెనకాల ఉండడంతో.. హై రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. కానీ వీటిని అందుకోవడంలో మూవీ ఫెయిల్ అవడంతో.. రిజల్ట్ కూడా తేడా వచ్చేసింది. నితిన్ గత చిత్రం లై కూడా ఇలాగే డిజప్పాయింట్ చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. అయితే.. తన ఫ్లాపులను మర్చిపోయి.. నితిన్ ఇప్పుడు ముందుకు వెళ్లిపోయాడు. ఫ్లాప్ సంగతి పక్కన పెట్టేసి.. తర్వాతి ప్రాజెక్టుపై దృష్టి సారించేశాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్.

శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం చండీఘడ్ లో షూటింగ్ ప్లాన్ చేయగా.. అక్కడకు చేరిపోయాడు నితిన్. దిల్ రాజుతో సహా టీం అందరితో కలిసి ఓ సెల్ఫీ కూడా దిగేశాడు. ఫ్లాపు రాగానే కుంగిపోయే హీరోలు ఉన్న ఇవాల్టి రోజుల్లో.. నితిన్ మాత్రం అందుకు భిన్నంగా ముందుకెళ్ళిపోయి తన ప్రాజెక్టుపై దృష్టి సారించేశాడు. ఈ సారి కచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు ఈ యంగ్ హీరో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు