మాస్ట‌ర్ చెఫ్ గా మారిన చిట్టి బాబు

మాస్ట‌ర్ చెఫ్ గా మారిన చిట్టి బాబు

రంగ‌స్థ‌లంలో చిట్టిబాబుగా దుమ్ము రేపాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆ సినిమా రికార్డులు కొల్ల‌గొడుతూ ప్ర‌యాణం సాగిస్తోంది. త‌న త‌రువాతి సినిమా షూటింగ్ సిద్ద‌మ‌వుతున్నాడు చెర్రీ. అందుకోసం వంట‌వాడిగా కూడా మారిపోయాడు. చ‌ర‌ణ్ వంట ఫోటోని అత‌ని ముద్దుల భార్య ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఇంత‌కీ చ‌ర‌ణ్ వంట ఎవ‌రికోసం?

ఉపాస‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌. త‌న భ‌ర్త‌కు సినిమాల‌కు, డైట్‌కు సంబంధించిన విష‌యాల‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో పంచుకుంటుంది. తాజాగా ఆమె చ‌ర‌ణ్  బ్రేక్ ఫాస్ట్ త‌యారు చేస్తున్న ఫోటోని పెట్టింది. మాస్ట‌ర్ చెఫ్ వ‌ర్క‌వుట్స్ చేశాక మా కోసం హెల్తీ  బ్రేక్‌ఫాస్ట్ త‌యారుచేస్తున్నాడు అని క్యాప్ష‌న్ పెట్టింది. మాస్ట‌ర్ సి ఎడోర‌బుల్ హ‌జ్బెండ్ అని హ్యాష్‌ట్యాగ్ పెట్టింది.  ఫోటోలో ఉన్న‌దాని ప్ర‌కారం చెర్రీ ఆమ్లెట్ వేసిన‌ట్టు అనిపిస్తోంది. ప్ర‌స్తుతం చెర్రీ బోయ‌పాటి శ్రీను సినిమాలో న‌టిస్తున్నాడు. రంగ‌స్థ‌లంలో డీ గ్లామ‌ర్ పాత్ర చేసిన చిట్టిబాబు బోయ‌పాటి సినిమాలో మాత్రం మంచి స్టైలిష్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు.

బోయ‌పాటి శ్రీను సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లైపోయింది. చెర్రీ ఈ నెల 21 నుంచి షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. భ‌ర‌త్ అను నేనులో కూడా కైరానే హీరోయినే. ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టించేందుకు చెర్రీ ఒప్పుకున్నాడు. బోయ‌పాటి శ్రీను సినిమా షూటింగ్ అయిన వెంట‌నే రాజ‌మౌళి సినిమా షూటింగ్లో పాల్గొంటాడు చెర్రీ. బోయ‌పాటితో చేయ‌బోయే సినిమా మాంచి యాక్ష‌న్ సినిమా అని తెలుస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు