రాజమౌళి మల్టీస్టారర్.. ఎప్పుడో తెలియదు

 రాజమౌళి మల్టీస్టారర్.. ఎప్పుడో తెలియదు

 ‘బాహుబలి’తో తెలుగు సినిమానే కాదు.. ఇండియన్ సినిమాను తిరుగులేని స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. ఆయన తర్వాతి సినిమా కోసం జనాల్లో ఏ స్థాయిలో ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా అన్ని భాషల ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో మెగా మల్టీస్టారర్‌కు రాజమౌళి శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుంది.. ఎప్పుడు విడుదలవుతుంది.. అనే విషయాల్లో క్లారిటీ లేదు.

ఇదే విషయం ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్యను అడిగినా స్పష్టత ఇవ్వలేదు. ఈ చిత్రం ఈ ఏడాదే మొదలు కావచ్చని.. కానీ సరిగ్గా ఎప్పుడు అన్నది తాను కూడా చెప్పలేనని అన్నాడు. ఈ సినిమా గురించి ఏ వివరాలూ చెప్పలేనని.. కాకపోతే ఆ సినిమా అదిరిపోతుందని మాత్రం దానయ్య చెప్పాడు. రాజమౌళి కోసం తాను పుష్కర కాలం నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి దొరికాడని దానయ్య చెప్పడం విశేషం. తాను 2006 నుంచి రాజమౌళితో సినిమా తీయడం కోసం వెంటపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి కాంబినేషన్లో సినిమా చేయడం తన అదృష్టమని.. ఆ చిత్రం భారీ బడ్జెట్లో తెరకెక్కుతుందని దానయ్య చెప్పాడు. ఈ మెగా మల్టీస్టారర్ ఈ ఏడాది చివర్లో మొదలై.. 2020 ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని భావిస్తున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English