పీకే లవ్.. ఎందుకీ ఎగస్ట్రాలు?

పీకే లవ్.. ఎందుకీ ఎగస్ట్రాలు?

తెలుగు వాళ్లకు ‘పీకే’ అనగానే పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు. ఆ రెండు అక్షరాలు  అలా పాపులర్ అయిపోయాయి మరి. అందుకే ఈ అక్షరాల్ని ఎవరు వాడినా పవన్ తలపుల్లోకి వస్తాడు. తాజాగా పూనమ్ కౌర్ ఒక అందమైన ఫొటో షూట్ చేసి.. ఆ ఫొటోల్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ #pklove అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో జనాలకు లేనిపోని సందేహాలు కలిగాయి. పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్థం కూడా ఉంది. కానీ ఆ విషయం జనాలకు ఎక్కడ తడుతుంది. తన మీద తాను ప్రేమ కురిపించుకుంటూ ‘పీకే లవ్’ అని హ్యాష్ ట్యాగ్ ఆమె జోడిస్తుందని ఎవరనుకుంటారు. పవన్‌కు ప్రేమతో ఈ ఫొటోల్ని షేర్ చేస్తున్న భావన కలుగుతోంది నెటిజన్లకు. కామెంట్లు కూడా ఈ తరహాలోనే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్-పూనమ్ కౌర్ బంధం గురించి ఇప్పటికే చాలా రచ్చ జరిగింది. ఈ విషయంలో జనాలకు అనేక సందేహాలున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మాట్లాడిన పూనమ్.. ఆ తర్వాత చిత్రంగా స్పందిస్తోంది. అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది. ఆమెను అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఒక మీడియా సంస్థ ఆమెతో ఇంటర్వ్యూల సిరీస్ ప్లాన్ చేయడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఇలాంటి తరుణంలో ‘పీకే లవ్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫొటోలు షేర్ చేయడం అంటే ఎగస్ట్రాలు కాక మరేంటి అని జనాలు పూనమ్‌ను తిట్టిపోస్తున్నారు. మరి ఆమె ఇలా ఎందుకు చేస్తున్నట్లో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English