చిరంజీవిలా సైలెంట్‌గా వుంటే పవన్‌కి డేంజర్‌

చిరంజీవిలా సైలెంట్‌గా వుంటే పవన్‌కి డేంజర్‌

ప్రజారాజ్యం టైమ్‌లో యువరాజ్యంకి సారథ్యం వహించిన పవన్‌కళ్యాణ్‌ ఎవరు ఏమన్నా మాటకి మాట బదులిచ్చేవాడు. రోజా, రాజశేఖర్‌లాంటి వాళ్లు చేసిన కామెంట్లకి కూడా పవన్‌ డైరెక్ట్‌ కౌంటర్లిచ్చాడు. అయితే పార్టీ ప్రెసిడెంట్‌గా చిరంజీవి మాత్రం తనగురించి ఎవరేమి మాట్లాడుతున్నా శాంతమూర్తిలా మాట్లాడేవాడు. చిరంజీవి మెతక వైఖరి చూసి మరింత మంది వచ్చి తనని టార్గెట్‌ చేసేవారు. ఎంత కాదన్నా దుష్ప్రచారం ఒక వర్గం జనాలని అయినా ప్రభావితం చేస్తుందని ప్రజారాజ్యం ఫలితాలే తెలియజెప్పాయి.

ప్రస్తుతం జనసేన అధ్యక్షుడు పవన్‌పై కూడా సిమిలర్‌ బురద జల్లుడు కార్యక్రమం జరుగుతోంది. ప్రతి విషయంలోను పవన్‌ స్పందించాలంటూ డిమాండ్లు చేసేవాళ్లే కాకుండా యుక్తాయుక్త విచక్షణ లేకుండా దూషించే వాళ్లు, దుర్భాషలాడే వాళ్లూ తయారయ్యారు. కొందరు లేడీ కార్డు వాడేస్తే, కొందరు వెనుకబడిన తరగతుల వారి హక్కులంటూ కుల, మతాల కార్డులు వాడేసి పవన్‌ని టార్గెట్‌ చేస్తూ టీవీ ఛానల్స్‌ ద్వారా ప్రచారం పొందుతున్నారు. ఈ వ్యవహారంపై పవన్‌ ఎలాంటి యాక్షన్‌ తీసుకోవడం లేదు. కనీసం తన పార్టీ తరఫున స్పోక్స్‌పర్సన్స్‌ని, ఇలాంటి వాటిని కౌంటర్‌ చేసే టీమ్‌ని కూడా ఏర్పాటు చేయడం లేదు.

ఇది అలాంటి కువిమర్శలు చేసే వారికి బలాన్నివ్వడమే కాకుండా, తమ ఆవేదనని ఎవరితో చెప్పుకోవాలో, ఎలా వ్యక్తపరచాలో తెలియని అభిమానులని బలహీనపరుస్తున్నాయి. కొందరు ఆవేశంగా వీడియోలు పోస్ట్‌ చేస్తే, కొందరు అలా విమర్శలు చేసే వారిని దూషిస్తూ వారు దానిని కంటిన్యూ చేయడానికి మరో కారణంగా మారుతున్నారు. పార్టీ నాయకుడిగా ప్రతి అంశంపై స్పందించాల్సిన పని లేదు కానీ కువిమర్శలని అంతే ఘాటుగా తిప్పి కొట్టడం, తనపై జరుగుతోన్న వ్యక్తిత్వ హననం అనే కార్యక్రమానికి ఆదిలోనే అంతం పలకడం పవన్‌ తక్షణ కర్తవ్యం. తను స్పందించే స్థాయి లేదని వదిలేసినట్టయితే ఎంకరేజ్‌ చేసే టీవీ ఛానళ్లు చాలానే వున్నాయి కనుక ఇలాంటి వాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే వుంటారు. క్యారెక్టర్‌ అసాసినేషన్‌కి అడ్డుకట్ట వేయడానికి తోడు జనసేన శ్రేణుల ఆత్మవిశ్వాసం నిలబెట్టడానికైనా దీనిని ఇంపార్టెంట్‌ ఇష్యూగా పవన్‌ కన్సిడర్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English