శ్రీరెడ్డి వికృత చేష్టలు వెలుగు చూస్తున్నాయ్‌

శ్రీరెడ్డి వికృత చేష్టలు వెలుగు చూస్తున్నాయ్‌

సినీ పరిశ్రమలో అవకాశాలిస్తామంటూ తనని శారీరికంగా ఎక్స్‌ప్లాయిట్‌ చేసారని, తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారికి అవకాశాలు లేవని ఆరోపిస్తూ వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డి వార్తా ఛానల్స్‌కి ఎక్కకముందు పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలాగే ఫేస్‌బుక్‌లో కూడా వీడియోలు పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా వుంటుంది. అయితే ఆమె గతంలో ఏమి చేసిందో, ఏమి మాట్లాడిందో తెలియక టీవీ ఛానల్స్‌లో ప్లే చేసిన విక్టిమ్‌ కార్డుని మాత్రమే నమ్మి చాలా మంది సానుభూతి చూపించారు.

మాలో సభ్యత్వం ఇవ్వలేదని అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అటుపై తాను కోరుకున్నది సాధించింది. అయితే తన కోరికల కంటే కూడా ఇండస్ట్రీలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలపై పోరాడతానంటూ శ్రీశక్తిగా అవతరించింది. సినిమాల నుంచి రాజకీయాల దిశగా వెళుతున్నట్టు కనిపించింది. అంతవరకు బాగానే వుంది. అయితే ఇలాంటి విషయాల్లో ముందుగా పోలీసులని ఆశ్రయించాలని పవన్‌ ఇచ్చిన సలహాని తప్పుబడుతూ అతడిని దుర్భాషలాడడంతో శ్రీరెడ్డి గతం లైమ్‌లైట్‌లోకి వస్తోంది. ఆమె తన ఫాలోవర్స్‌తో ఎలాంటి చాట్స్‌ చేస్తుందనేదానికి వీడియో ప్రూఫ్‌లున్నాయి. అలాగే తనని ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్‌ జర్నలిస్టులతో మాట్లాడిన వికృతమైన మాటలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

ఇంతకాలం కేవలం కొందరికే తెలిసిన ఈ సంగతులన్నీ ఇప్పుడు హైలైట్‌ అయి శ్రీరెడ్డి వయా టీవీ ఛానల్స్‌ తెచ్చుకున్న సింపతీ కాస్తా రివర్స్‌ అవుతోంది. ఆమె పద్ధతి ఏమిటో, ఏ విధంగా మాట్లాడుతుందో, ఆమె ఆలోచనా సరళి ఎలా వుంటుందో వీడియో ఆధారాలుండడంతో ఇప్పుడు జూనియర్‌ ఆర్టిస్టుల పాలిట 'మదర్‌ థెరీసా' మాదిరిగా వాళ్లని 'పిల్లలు' అంటూ సంబోధిస్తూ చేస్తోన్న షో ఒక్కసారిగా కళ తప్పింది. ఇప్పుడు మేలుకుని ఆ వీడియోలు తొలగిద్దామన్నా కూడా సోషల్‌ మీడియా అంతటా హల్‌చల్‌ చేస్తోన్న వాటిని అదుపు చేసుకునే వీల్లేదు. ఈ నేపథ్యంలో ఇక మీదట ఏ విధంగా దీనిని కౌంటర్‌ చేసుకుంటూ టీవీ టైమ్‌ దక్కించుకుంటుందనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English