చరణ్ సినిమాకు అలాంటి టైటిలా?

చరణ్ సినిమాకు అలాంటి టైటిలా?

ఒక స్టార్ హీరో సినిమా ఇలా మొదలైందంటే చాలు.. అలా ఊహాగానాలు మొదలైపోతాయి. తాజాగా ‘రంగస్థలం’తో నాన్-బాహుబలి రికార్డు విజయాన్ని అందుకున్న రామ్ చరణ్.. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వోం నటిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు ఈ మధ్యే. ఈ చిత్రం ప్రారంభ దశలో ఉండగానే దీని టైటిల్ గురించి చర్చ మొదలైపోయింది. దీనికి ‘రాజ వంశస్థుడు’ అనే టైటిల్ ఖరారైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నిజంగా ఈ టైటిల్ ఖరారు చేస్తారా అన్నది సందేహమే.

రాజవంశస్థుడు అనేది అగ్ర వర్ణ ఆధిపత్యాన్న చాటే టైటిల్. దీన్ని అందరూ ఆమోదిస్తారా అన్నది డౌట్. ప్రస్తుతం రాజకీయాలు చాలా సున్నితంగా తయారయ్యాయి. కుల.. వర్గ ఆధిపత్యాన్ని చూపించే సినిమాలు తీస్తే.. టైటిళ్లు పెడితే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. దాని మీద బయట కుడా వివాదాలు తలెత్తుతున్నాయి. పైగా చరణ్ మెగాస్టార్ ఘన వారసత్వంతో సినిమాల్లకి వచ్చిన నేపథ్యంలో ‘రాజవంశస్థుడు’ అని పెడితే అహంకారాన్ని చాటినట్లు అవుతుంది. కాబట్టి ఇలాంటి టైటిల్ అంత ఆమోదయోగ్యం కాదనే చెప్పాలి. మరి బోయపాటి ఆలోచన ఎలా ఉందో? అయినా బోయపాటి టైటిల్ అనుకుంటే సరిపోతుందా.. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, అల్లు అరవింద్.. ఇలా చాలామంది ఆమోద ముద్ర పడాలి దానికి. చూద్దాం అందరూ ఈ టైటిల్‌కు ఓటేస్తారో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు