పెద్ద దర్శకుల సంగతేంటి సునీల్‌?

పెద్ద దర్శకుల సంగతేంటి సునీల్‌?

హీరో అయిపోయిన తరువాత ప్రేక్షకులకు అస్సలు కనిపించడం మానేశాడు సిక్స్‌ప్యాక్‌ సునీల్‌. మనోడు ఈ మద్యన వరుసగా సినిమాలున్నాయ్‌ అని చెప్పుకుంటున్నాడు కాని, మార్కెట్‌  పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు. కామెడీని వదిలేసి హీరో ఎక్స్‌ప్రెస్‌ ఎక్కేసిన సునీల్‌ బాబు, ఈ మధ్యనే తడాఖా సినిమాతో హిట్టు కొట్టాడు కాని, అది మనోడి ఖాతాలో పడటంలేదులేండి.

ఇక ప్రస్తుతం భీమవరం బుల్లోడు సినిమా చేస్తున్న సునీల్‌, ఆ తరువాత పెద్ద లైనప్‌ ఉందని చెప్తున్నాడు. లేడి దర్శకురాలు బి జయతో ఒక సినిమా, వీరు పోట్లతో ఇంకో సినిమా, రచయిత గోపిమోహన్‌తో ఒక సినిమా ఉన్నాయట. మరి వీళ్ళందరిలో ఒక్క దర్శకుడు కూడా టాప్‌ లీగ్‌లోవారో, లేక బ్రాండ్‌ వాల్యూ ఉన్నవారో కాదు. అందరూ చిన్న చిన్న సినిమాలు తీస్తూ బండిని నెట్టుకొస్తున్నవారే.

ఒక పెద్ద స్టార్‌ హీరో కావాలని కలలు కంటున్న సునీల్‌, అసలు పెద్ద పెద్ద దర్శకులతో సినిమాలు చెయ్యకపోతే ఎలా? బ్రాండ్‌ వాల్యూ  పెరగాలి, సినిమాల ఓపెనింగ్స్‌ పెరగాలంటే, మనోడు ఖచ్చితంగా స్టార్‌ దర్శకులతోనే పనిచేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు