మంచి హీరోయిన్లు.. ఎందుకు సపోర్టు చేయట్లేదు?

మంచి హీరోయిన్లు.. ఎందుకు సపోర్టు చేయట్లేదు?

సంచలన ఆరోపణలు చేస్తూ టీవీలకు ఎక్కిన శ్రీరెడ్డి.. ఇప్పుడు సెన్సేషన్ అనడంలో సందేహం లేదు. ఇలా ఓ సమస్య మీద పోరాటం చేయడం అనేది గతంలోనూ ఉంది కానీ.. ఈమె ఓ కొత్త యాంగిల్ ను ఎంచుకుంది. రూటు పాతదే అయినా యాంగిల్ కొత్తదే. ఈమె చెబుతున్న అంతిమ లక్ష్యం.. టాలీవుడ్ సినీ మహిళలకు కాస్టింగ్ కౌచ్ నుంచి రక్షణ కల్పించడం.

మన ఇండస్ట్రీలో చాలామంది మహిళా సీనియర్లు సామాజిక సేవలో ఉన్నారు.. కానీ వీరెవరూ శ్రీరెడ్డి ఇష్యూపై స్పందించని విషయాన్ని గమనించాలి. అక్కినేని నాగార్జున భార్య అయిన అమల.. జంతు సంరక్షణ హక్కుల కోసం ఎంతగా పోరాడతారో తెలిసిన విషయమే. శ్రీరెడ్డి ఉదంతంపై ఈమె నుంచి ఒక్క మాట రాలేదు. ఎమ్మెల్యే కూడా అయిన సీనియర్ నటి రోజా.. ఈ అంశంపై స్పందించలేదు. రోజాతో పాటు జీవిత రాజశేఖర్ కూడా సామాజిక అంశాలకు సంబంధించిన టీవీ షోలు చేస్తుంటారు. వీళ్లెవరూ మాట్లాడలేదు.

మంచు లక్ష్మి నుంచి కూడా ఈ అంశంపై ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. వీరంతా ఇండస్ట్రీ పరంగానే కాదు.. సామాజికంగా కూడా పవర్ ఫుల్ వ్యక్తులే. అయినా వీరి నుంచి శ్రీరెడ్డికి మద్దతు రాకపోవడానికి వెనుక చాలానే కారణాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. పైగా కెమేరాలు ముందు కనిపిస్తున్నాయి కదా.. తెలుగు టీవీ ఛానళ్లు చూపిస్తున్నాయి కదా అని.. నోటికొచ్చినట్లా మాట్లాడడం అనే అంశం.. ఈమెకు చాలామంది సపోర్ట్ ను దూరం చేస్తోందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English