పిక్ టాక్: ట్రెడిషనల్ తెలుగు గ్లామర్

పిక్ టాక్: ట్రెడిషనల్ తెలుగు గ్లామర్

బాలీవుడ్ లో చాలామంది హీరోలు.. యాక్టర్ల కుమార్తెలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా టాప్ పొజిషన్ కు చేరారు. టాలీవుడ్ వారసత్వంతో హీరోయిన్లు అయింది చాలా కొద్దిమందే. తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. అడవి శేష్ హీరోగా నటిస్తున్న 2 స్టేట్స్ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం కాబోతుంది.

ప్రస్తుతం 2 స్టేట్స్ నిర్మాణ దశలో ఉంది. ఈ టైంలోనే టాలీవుడ్ కు తనలో ఉన్న గ్లామర్ ను పరిచయం చేయాలని శివాని ఆరాటపడుతోంది. రీసెంట్ గా ఓ ఫ్యాషన్ షో ర్యాంప్ పై శివాని అదరగొట్టేసింది. మెరూన్ కలర్ డ్రస్ లో ట్రెడిషనల్ లుక్ లో ర్యాంపుపై నడిచి అందరి దృష్టిని  ఆకర్షించింది. యాంటిక్ జ్యూయలరీ.. ముక్కుపడకతో ఓ కొత్త లుక్ లో కనిపించింది. ఇదే టైంలో కనీ కనిపించని క్లీవేజ్ సోకులతో గ్లామర్ ప్రియులను ఆకట్టుకునే ప్రయత్నమూ చేసింది. కానీ మరీ ఇంత ట్రెడిషనల్ లుక్ అన్నా కూడా గ్లామర్ ఎలివేట్ అవడం కష్టమే. కాకుంటే స్టార్ డాటర్ కావడంతో ఆమెకు ఈ మాట చెప్పేవారు ఎవరన్నదే క్వశ్చన్.

ఫేమస్ ఇండియన్ రైటర్ చేతన్ భగత్ రాసిన 2 స్టేట్స్ నవల ఆధారంగా బాలీవుడ్ లో అర్జున్ కపూర్ - ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అదే పేరుతో సినిమా వచ్చంది. ఇప్పుడు అదే సినిమాను తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. ఇందులోనే అడవి శేష్ - శివాని జంటగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు