3 గంటల్లో మాట మార్చింది.. కుట్ర కాదా?

3 గంటల్లో మాట మార్చింది.. కుట్ర కాదా?

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి వ్యవహారం ఎన్నెన్నో మలుపులు తిరుగుతోంది. తనకు అన్యాయం జరిగిందంటూ టీవీ ఛానళ్లకు వెళ్లి టీఆర్పీ రేటింగులు పెంచుతోంది. మా సభ్యత్వం ఇవ్వలేదంటూ అర్ధనగ్న ప్రదర్శన చేసింది. మరోవైపు శ్రీరెడ్డి వ్యవహారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టే వరకూ వచ్చింది.

శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించమంటే.. పోలీసులకు ఫిర్యాదు చేయడం సరైన పని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ కూడా చెప్పిన ఈమె.. పోలీసులకు కంప్లెయింట్ చేసింది. కానీ ఈ ఫిర్యాదులో ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తులు కాకుండా.. కేవలం ఆమెను లైవ్ షోలలో తిట్టిన వారి పేర్లు మాత్రమే ఉండడం ఆశ్చర్యం కలిగించింది. కానీ ఇంతలో ఏమయిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో పవన్ కు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టిన 3 గంటల వ్యవధిలోనే మాట మార్చేసింది శ్రీరెడ్డి.

పవన్ ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడని.. అమ్మాయిలు అంటే విలువ తెలియని వ్యక్తి అని.. అలాంటి వాడిని అన్న అని అన్నందుకు చెప్పుతో కొట్టుకుంటానని చెప్పడమే కాదు.. కొట్టుకుంది కూడా. అయితే.. 3 గంటల వ్యవధిలో ఇలా కంప్లీట్ రివర్స్ అయిపోవడం వెనుక.. ఆమెకు ఎవరో వెనుక నుంచి జ్ఞానోదయం కలిగించేలా హితబోధలు.. ఉపదేశాలు చేశారనే టాక్ వినిపిస్తోంది. అసలు పవన్ వెనుక జరుగుతున్న కుట్రలోనే భాగంగా.. ఇలా పవన్ పేరును ఈ ఇష్యూలోకి లాగడం జరుగుతోందనే వాదన కూడా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English