ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌నం..నీకేనా ఫ్యాన్స్ ఉండేది?

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి సంచ‌ల‌నం..నీకేనా ఫ్యాన్స్ ఉండేది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై న‌టి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్కు మాత్ర‌మే ఫ్యాన్స్ ఉంటారా? ఇంకెవ‌రికీ ఉండ‌రా అంటూ ఆమె ఫైర్  అయింది. బ‌షీర్‌బాగ్ ప్రెస్‌క్ల‌బ్ లో చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న అర్టిస్టులు కాస్టింగ్ కౌచ్ విధానాన్ని, కో ఆర్డినెన్స్ విధానాన్ని రద్దు చేయాల‌ని సమావేశం నిర్వ‌హించారు. సమావేశానికి శ్రీరెడ్డి, సినీ నటి అపూర్వ, ఓయూ జేఏసీ నాయకులు, పలు మహిళా సంఘాల నాయకులు స‌హా ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్‌పై సంచలన కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ని అదుపులో పెట్టుకోలేరా? అని ప్రశ్నించింది. పవన్ కళ్యాణ్ ఒక్కడికేనా ఫ్యాన్స్ ఉండేదని దుయ్యబట్టింది. తాము ఎవరకీ భయపడేది లేదని స్పష్టం చేసింది.

వారు సినిమాల్లో తెర‌మీద‌ చూపిస్తే శృంగారం అవుతుంది కానీ తాము బ‌య‌ట చేస్తే వ్య‌భిచారం అవుతుందా అంటూ శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించారు. `మా`కు తొత్తులుగా బ‌తికే వారిగా బ‌తుకుతున్నార‌ని..ఎలా బ్ర‌తుకుతార‌ని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో వారికి నిండుగా ఉంచుకోవాల‌ని చూస్తార‌ని...సినీ న‌టుల విష‌యంలో ఎక్క‌డ పిసికిస్తే అక్క‌డ పిసికించుకోవాలా అని శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించారు. సినీహీరోలు చామ‌నచాయ‌గా ఉండ‌వ‌ద్ద‌ని అంటార‌ని, హీరోలు మాత్రం అలా ఉండ‌వ‌చ్చా? అని నిల‌దీశారు. ఫారిన్ ట్రిప్పుల పేరుతో అమ్మాయిల‌పై వేధింపులు చేస్తున్నార‌ని ఆరోపించారు. త‌మ‌కు ఇబ్బందులున్నాయ‌ని చెప్పుకొనే వేదిక ఎక్క‌డ ఉంద‌ని ఆమె ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు సినీనటి శ్రీరెడ్డి హుమాయూన్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈనెల 4న ఓ టీవీచానల్‌లో డిబేట్‌ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా తనను చంపుతామని బెదిరిస్తున్నారని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హుమాయూన్‌గన్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ డిబేట్‌ను పరిశీలించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English