మలయాళ ‘బిగ్ బాస్’ హోస్ట్ ఎవరో తెలుసా?

మలయాళ ‘బిగ్ బాస్’ హోస్ట్ ఎవరో తెలుసా?

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన ‘బిగ్ బాస్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. రెండు నెలలకు పైగా మన జనాలు ‘బిగ్ బాస్’ జ్వరంతో ఊగిపోయారు. ఆ 70 రోజులు ఎక్కడ చూసినా బిగ్ బాస్ చర్చలే నడిచాయి. ముందు ఈ షో ఏ మేరకు విజయవంతమవుతుందో అన్న సందేహాలన్నీ తర్వాత పటాపంచలయ్యాయి. ఎన్టీఆర్ అద్భుత హోస్టింగ్.. పార్టిసిపెంట్స్ నైపుణ్యం కూడా తోడై షో విజయవంతమైంది. మరోవైపు తమిళంలో కూడా ‘బిగ్ బాస్’ పెద్ద విజయం సాధించింది. కమల్ హాసన్ హోస్టింగ్ టాలెంట్‌కు ఒవియా ఇష్యూ తోడై ఆ షో అక్కడ సక్సెస్ అయింది. దీంతో ఈ ఏడాది కేరళలోనూ ‘బిగ్ బాస్’ అడుగుపెట్టబోతోంది.

మలయాళ ‘బిగ్ బాస్’కు హోస్ట్‌గా వ్యవహరించబోయేది మరెవరో కాదు.. సూపర్ స్టార్ మోహన్ లాల్. భారీ పారితోషకంతో ఆయన్ని ఈ కార్యక్రమానికి ఒప్పించిందట ఒక ఛానెల్. త్వరలోనే ఈ షోకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘మలయాళ బిగ్ బాస్’ తొలి సీజన్ ఆరంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే పార్టిసిపెంట్స్ వేట మొదైలందట. కేరళలో మోహన్ లాల్‌కున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? తిరుగులేని ఇమేజ్, ఫాలోయింగ్.. చక్కటి వాక్చాతుర్యం ఉన్న ఆయన ఈ షోను రక్తి కట్టిస్తారనడంలో సందేహం లేదు. తెలుగులో ఆయన ‘జనతా గ్యారేజ్’తో కలిసి నటించిన ఎన్టీఆర్ ఇక్కడ ‘బిగ్ బాస్’కు హోస్ట్ అయితే. ఇప్పుడు మోహన్ లాల్ కూడా అదే షోను నడిపించబోతుండటం విశేషం.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English