రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడు

రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడు

అనుకున్నదే అయింది. అంచనాలు నిజమయ్యాయి. మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి బడా స్టార్ల వల్ల కానిది రామ్ చరణ్ సాధించాడు. గత ఏడాది ‘ఖైదీ నంబర్ 150’తో చిరు నెలకొల్పిన నాన్-బాహుబలి రికార్డును చరణ్ సినిమా ‘రంగస్థలం’ అధిగమించింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ షేర్ ఆదివారం నాటితో రూ.106 కోట్లకు చేరుకుంది. గత సంక్రాంతికి చిరు సినిమా రూ.105 కోట్ల షేర్‌తో ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో ఎన్నో భారీ సినిమాలు వచ్చాయి కానీ.. ఏవీ ‘ఖైదీ’ రికార్డు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి.

ఐతే ఎట్టకేలకు చరణ్ ‘రంగస్థలం’ రికార్డు బద్దలుకొట్టింది. తొలి వారాంతంలోనే రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కూడా జోరు కొనసాగించింది. ‘ఖైదీ నంబర్ 150’ ప్రధానంగా వీకెండ్లోనే మెజారిటీ వసూళ్లు రాబట్టింది. కానీ ‘రంగస్థలం’.. రెండు మూడు వారాల్లోనూ కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకెళ్లింది. కన్సిస్టెంట్‌గా వసూళ్లు రాబట్టి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాపై పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరూ లాభాలందుకున్నారు. నైజాం ఏరియాలో మాత్రమే ఈ చిత్రానికి రూ.23.3 కోట్ల షేర్ రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ షేర్ రూ.55 కోట్ల దాకా ఉంది. మొత్తం తెలుగు రాష్ట్రాల వరకే ఈ చిత్రం రూ.78 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. అమెరికాలో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. కర్ణాటకలో షేర్ రూ.8 కోట్ల దాకా వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English