కొరటాల జవాబు.. సమర్థనీయమా?

కొరటాల జవాబు.. సమర్థనీయమా?

తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు. కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి అభిరామ్ తో పాటు శేఖర్ కమ్ముల.. కోన వెంకట్.. కొరటాల శివ లాంటి వాళ్లపై ఆమె ఆరోపణలు చేసింది. ఇందులో శేఖర్ కమ్ముల పేరు మాత్రం సూటిగా చెప్పలేదు. ఆయన వెంటనే స్పందించి లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు శ్రీరెడ్డిని హెచ్చరించాడు. కోన కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. అభిరామ్ ప్రమేయంపై దగ్గుబాటి ఫ్యామిలీ మౌనంగా ఉంది. వాళ్లెవ్వరూ మీడియాకు దొరకట్లేదు. ఇక కొరటాల విషయానికి వస్తే.. శ్రీరెడ్డితో చేసినట్లుగా చెబుతున్న వాట్సాప్ చాట్ విషయంలో ఆయన స్పందన చిత్రంగా ఉంది.

ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ‘భరత్ అనే నేను’ మీదే ఉందని.. ఈ అంశంపై తర్వాత స్పందిస్తానని సమాధానం దాట వేశాడు కొరటాల. ‘భరత్ అనే నేను’ గురించి గంటలు గంటలు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తున్న కొరటాల ఒక రెండు నిమిషాలు తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ ఆరోపణలు అబద్ధం అని ఖండించడానికి ఎంత సమయం పడుతుంది? ఆ మాట అనలేదంటే ఆయన పాత్రపై సందేహాలు కలుగుతున్నాయి. సమాధానం దాట వేయడంతోనే దీనిపై మరింత డిస్కషన్ నడుస్తోంది. ఆ వాట్సాప్ చాట్ కొరటాల చేయలేదని.. ఆయన ఫోన్ వాడుతున్న అసిస్టెంట్ చేశాడని ఏదో ఒక ఊహాగానం వినిపిస్తోంది. మరి ఆ విషయాన్నయినా కొరటాల చెప్పాలి కదా? నిమిషం.. రెండు నిమిషాల్లో వివరణ పూర్తయ్యే విషయం గురించి కొరటాల సమాధానం ఎందుకు దాటవేశాడన్నది అర్థం కావడం లేదు. తర్వాత అన్నాడంటే.. దీని గురించి ఇంకోసారి సవివరంగా చెప్పడానికి ఇంకో ప్రెస్ మీట పెట్టబోతున్నాడా? అసలు ‘భరత్ అనే నేను’ రిలీజయ్యాక కొరటాల ఎవరికైనా ఎందుకు దొరుకుతాడు? ఆటోమేటిగ్గా అప్పటికి జనాలు కూడా ఈ వ్యవహారం మరిచిపోతారన్న ధీమానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English