రాజశేఖర్-జీవిత.. ఏం జవాబిస్తారు?

రాజశేఖర్-జీవిత.. ఏం జవాబిస్తారు?

కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో రోజుకో పేరు బయటికి వస్తోంది. తాజాగా రాజశేఖర్-జీవితల గురించి మహిళా సంఘం నేత సంధ్య చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రాజశేఖర్ కోసం ఆయన భార్య జీవితే స్వయంగే పేద అమ్మాయిలకు వల వేసి ఆయన దగ్గరికి పంపించేదంటూ సంధ్య ఓ టీవీ ఛానెల్ చర్చలో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీరి వల్ల ఇబ్బంది పడ్డ ఇద్దరు అమ్మాయిల కేసుల్ని తానే డీల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిదని.. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లాంటిదేమీ లేదని జీవిత ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ పేర్కొనడాన్ని సంధ్య తప్పుబట్టింది.

గతంలో ఒక అమ్మాయిని జీవిత తన భర్త దగ్గరికి పంపడానికి చూసిందని.. ఐతే ఆ అమ్మాయి జ్వరంతో వెళ్లలేకపోవడంతో ఫోన్ చేసి బూతులు తిట్టిందని.. నువ్వ రాకపోతే రాజశేఖర్ దగ్గరికి ఎవరు పోతారంటూ తిట్టి పోసిందని.. ఇది విన్న ఆ అమ్మాయి ఫ్రెండు తనకు విషయం చెప్పిందని.. తాను ఆ అమ్మాయి కోసం పోరాడానని సంధ్య చెప్పింది. ఆ అమ్మాయి చేత ఆంధ్రజ్యోతి పత్రికకు తాను లేఖ రాయిస్తే.. ఆ లేఖను ప్రచురించారు కూడా అని ఆమె వెల్లడించింది. అలాగే మరో అమ్మాయితో కూడా జీవిత ఇలాగే ప్రవర్తించిన ఉదంతం తన దృష్టికి వచ్చిందని సంధ్య వెల్లడించింది. ఇలాంటి మరెన్నో ఉదంతాల గురించి తాను విన్నట్లు ఆమె తెలిపింది. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న జీవిత ఇప్పుడొచ్చి ఇండస్ట్రీ మంచిదని వ్యాఖ్యానించడం హిపోక్రసీనే అని ఆమె అంది. జీవిత లాంటి వాళ్లు కమిటీ అగైన్స్ట్ సెక్సువల్ హరాష్మెంట్ లాంటి వాటిలో సభ్యులుగా ఉంటే ఏం న్యాయం జరుగుతుందని సంధ్య ప్రశ్నించింది. సంధ్య ఈ స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించాల్సిన బాధ్యత జీవిత-రాజశేఖర్‌ల మీద ఉంది. ముఖ్యంగా ఏ ఇష్యూ మీదైనా గట్టిగా మాట్లాడే జీవిత ఇప్పుడేమంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు