దిల్‌ రాజు లెక్క మళ్లీ తప్పింది

దిల్‌ రాజు లెక్క మళ్లీ తప్పింది

నిర్మాతగా ఏ సినిమా ఎంత సక్సెస్‌ అవుతుందనేది పర్‌ఫెక్ట్‌గా క్యాలిక్యులేట్‌ చేస్తూ విజయాలు అందుకుంటోన్న దిల్‌ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం వరుస మిస్టేక్స్‌ చేస్తూనే వున్నాడు. స్పైడర్‌, అజ్ఞాతవాసి చిత్రాల నైజాం హక్కులని భారీ మొత్తానికి కొన్న దిల్‌ రాజుకి భారీ నష్టాలొచ్చాయి. జై లవకుశ కూడా నష్టాలే మిగల్చడంతో పెద్ద సినిమాల పంపిణీ జోలికి పోరాదని డిసైడ్‌ అయ్యాడు. పెద్ద సినిమాలని ఒక ఏరియాకి కొని నష్టపోయేకంటే అదే మొత్తంతో ఒక మీడియం బడ్జెట్‌ సినిమా పంపిణీ హక్కుల్ని హోల్‌సేల్‌గా తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

తొలిప్రేమ చిత్రాన్ని అలాగే పంపిణీ చేసిన దిల్‌ రాజుకి పెద్దగా లాభాలు రాకపోయినా పెట్టిన డబ్బులు తిరిగొచ్చాయి. అలాగే 'కృష్ణార్జున యుద్ధం' కూడా తేడా అవదనే నమ్మకంతో నాని మాట మీద తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులు ఏకమొత్తంగా తీసేసుకున్నాడు. కానీ ఈ చిత్రంతో దిల్‌ రాజుకి నష్టాలు తప్పేట్టు లేవు. ఇదిలావుంటే నైజాంలో రంగస్థలం చిత్రాన్ని పద్ధెనిమిది కోట్లకి కొనేందుకు దిల్‌ రాజు నిరాకరించాడు. దాంతో నిర్మాతలు యువి ద్వారా నైజాంలో స్వయంగా విడుదల చేసుకున్నారు. ఇప్పుడు నైజాంలోనే ఇరవై అయిదు కోట్లకి పైగా షేర్‌ వస్తోంది.

సుకుమార్‌ సినిమా కమర్షియల్‌గా రన్‌ అవదనే అపోహతో వున్న దిల్‌ రాజు ఒక మంచి అవకాశాన్ని మిస్‌ చేసుకున్నాడు. పూరి రూపొందించిన మెహబూబా చిత్రం హక్కులు తీసుకున్న దిల్‌ రాజు దాంతో అయినా పంపిణీదారునిగా పూర్వ వైభవం తెచ్చుకుంటాడా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు