చిరంజీవి విజిట్‌ వెనుక బన్నీ మెగా స్కెచ్‌!

చిరంజీవి విజిట్‌ వెనుక బన్నీ మెగా స్కెచ్‌!

రంగస్థలంతో రామ్‌ చరణ్‌ విజయాన్ని అందుకోవడమే కాకుండా నిజమైన 'మెగా వారసుడు' అంటూ అభిమానులతో కితాబులందుకుంటున్నాడు. ఇంతకాలం మెగా హీరోలంతా ఫెయిలవుతున్నా నిలకడ చూపిస్తూ వచ్చిన అల్లు అర్జున్‌ని అతని ఎక్స్‌క్లూజివ్‌ అభిమానులు 'నెక్స్‌ట్‌ మెగాస్టార్‌' అంటూ హల్‌చల్‌ చేసారు. మెగా నీడలోంచి బయటకి వస్తూ తన ఓన్‌ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్‌ చేసుకునే ప్రయత్నం అల్లు అర్జున్‌ కూడా చేసాడు.

పవన్‌ ఫ్లాపులివ్వడం, చరణ్‌ వెనకబడిపోవడం కూడా అల్లు అర్జున్‌కి అడ్వాంటేజ్‌ అయింది. అయితే అనూహ్యంగా ఒకే సినిమాతో చరణ్‌ అటు బాక్సాఫీస్‌ని షేక్‌ చేయడమే కాకుండా ఇటు నటుడిగాను తనపై వున్న విమర్శలన్నీ ఎప్పటికీ చెరిగిపోయేలా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేసాడు. దీంతో బన్నీ కాస్త సైడ్‌ లైన్‌ అయ్యాడు. ఈలోగా చరణ్‌ కోసం పవన్‌కళ్యాణ్‌ కదిలి వచ్చి అతడిని ఆకాశానికి ఎత్తేసాడు. చరణ్‌ ఇమేజ్‌ మెగా అభిమానుల్లో రెండింతలు అయ్యేలా పవన్‌ అతడిని ప్రశంసలతో ముంచెత్తాడు. అసలే పవన్‌తో డిస్టెన్స్‌ పాటిస్తూ ఇప్పటికే పవన్‌ అభిమానులకి శత్రువుగా మారిన అల్లు అర్జున్‌కి ఈ పరిణామంతో మరింత ఇబ్బంది తలెత్తింది. మెగా అభిమానులు తనని సైడ్‌లైన్‌ చేస్తోన్న తరుణంలో వారి అటెన్షన్‌ రాబట్టడానికా అన్నట్టు 'నా పేరు సూర్య' సెట్స్‌కి చిరంజీవి విజిట్‌ చేసిన విషయాన్ని బాగా ప్రమోట్‌ చేసారు.

ఇలా షూటింగ్‌ స్పాట్‌కి చిరంజీవి అడపాదడపా రావడం మామూలే. అయితే ఈసారి మాత్రం దానికి బాగా ప్రచారం కల్పించారు. మెగాస్టార్‌తో, ఆయన కుటుంబంతో రిలేషన్‌ స్ట్రాంగ్‌గానే వుందని, 'నేనూ మీ వాడినే' అని బన్నీ ఫాన్స్‌కి ఈ విధంగా మెసేజ్‌ పంపించాడనే టాక్‌ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇంతకీ 'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరుని పిలుస్తారా లేక చరణ్‌ని తీసుకొస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు