స్టార్ హీరోల గాలి మామూలుగా తీయలేదు

స్టార్ హీరోల గాలి మామూలుగా తీయలేదు

తెలుగు సినీ పరిశ్రమలో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిన్న హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీరెడ్డి, అపూర్వ మినహాయిస్తే తెలిసిన ముఖాలేమీ లేవు. అయినప్పటికీ అందులో పాల్గొన్న చిన్న స్థాయి ఆర్టిస్టుల ప్రసంగాలు సూపర్ పాపులరయ్యాయి.

తూటాల్లాంటి మాటలతో కొందరు అదిరిపోయే ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాల తాలూకు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ బెంగాలీ అమ్మాయిలతో మసాజులు చేయించుకుంటాడంటూ ఓ అమ్మాయి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆ అమ్మాయి అంతటితో ఆగలేదు. టాలీవుడ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. వాళ్లు హీరోలా.. వాళ్ల ముఖాలు చూశారా?కోతి మొహాలు అనేసిందామె. కొందరు హీరోలు 20-30 సర్జరీలు చేయించుకుంటే ఆమాత్రం ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొందరు వారసులకు గట్టిగా తగిలేవే. ఇక స్టార్ హీరోల హైట్ గురించి కూడా ఆమె బోల్డ్ కామెంట్లు చేసింది. ప్రభాస్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే ఎవరూ హైట్ లేరని.. వీళ్లేం హీరోలని.. వీళ్లు ఎందుకు పనికొస్తారని అంది. ఇక మరో అమ్మాయి పవన్ కళ్యాణ్ గాలి బాగానే తీసేసింది. మొన్న శ్రీరెడ్డి వ్యాఖ్యలపై పవన్ స్పందిస్తూ.. ఆమె మీడియాకు కాకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని సూచించిన సంగతి తెలిసిందే.

ఐతే ఆ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని నిమిషాల ముందే పవన్.. ఎవరైనా అమ్మాయికి అన్యాయం జరిగితే అక్కడికక్కడ కొట్టాలని పిలుపునిచ్చాడు. ఆ మాట అన్నవాడు.. శ్రీరెడ్డిని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని.. రోడ్డు మీద నిరసన వ్యక్తం చేయొద్దని ఎలా అంటాడని ఆ అమ్మాయి ప్రశ్నించింది. బయట అమ్మాయిలు వేరు.. సినీ పరిశ్రమలోని అమ్మాయిలు వేరా అంటూ పవన్ కు చురకలు అంటించిందా అమ్మాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English