రాజు హ్యాండ్ అచ్చొస్తుందా మరి!?

 రాజు హ్యాండ్ అచ్చొస్తుందా మరి!?

దిల్ రాజు అంటే స్టార్ ప్రొడ్యూసర్. ఎంతో మందికి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. సబ్జెక్ట్ ఎంపిక చేయడం దగ్గర నుంచి మేకింగ్ వరకూ.. ప్రమోషన్స్ నుంచి రిలీజ్ వరకూ అన్ని పనులు హ్యాండిల్ చేసేస్తారు. ఈయన ప్రొడక్షన్ లో సినిమాలు చేసిన హీరోలు తమ రేంజ్ పెంచుకోవడం చూస్తూనే ఉంటాం.

కానీ దిల్ రాజు హ్యాండ్ అచ్చి రాదనే మాట కూడా ఒక రకంగా వాస్తవమే. ఆల్రెడీ నిరూపించుకున్న హీరోల స్థాయిని పెంచడంలో దిల్ రాజుకు మంచి ట్రాక్ రికార్డే ఉంది. కానీ కొత్త హీరోలను.. ముఖ్యంగా స్టార్ కిడ్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం మాత్రం కలిసి రాలేదు. దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో జోష్ అనే మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశాడు అక్కినేని నాగచైతన్య. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం.. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ఈ విషయంపైనే తెగ భయపడుతున్నారు.

మహేష్ ఫ్యామిలీ మెంబర్ అనే ట్యాగ్ తో.. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు.. మహేష్ కు మేనల్లుడు అయిన గల్లా అశోక్ మొదటి సినిమా మొదలవుతోంది. ఇతడిని దిల్ రాజు చేతిలో పెట్టేశాడు మహేష్ బాబు. కొత్త హీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో దిల్ రాజు వీక్ నెస్ కారణంగా.. మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు కొంత టెన్షన్ పడుతున్నారు. కానీ దిల్ రాజు మాత్రం ఈ ప్రాజెక్టుపై కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English