పవన్-బన్నీ సెటిల్మెంట్ ఆన్ ది వే

పవన్-బన్నీ సెటిల్మెంట్ ఆన్ ది వే

మెగా ఫ్యాన్స్ లో విబేధాలు అనే పాయింట్ అసలు వినిపించేదే కాదు. ఎంత మంది హీరోలు వచ్చినా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అల్లు అర్జున్ తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడంటే.. మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ బేస్ అనడంలో తప్పేమీ కాదు. అల్లు అర్జున్ కి కూడా మెగాస్టార్ అన్నా.. మెగా ట్యాగ్ అన్నా చాలానే ఇష్టం.

దాని నుంచి బయటకు వచ్చేందుకు ట్రై చేశాడనే కథనాలు వచ్చినా.. వాటన్నిటినీ తనే కొట్టి పారేశాడు. కానీ పవన్ ఫ్యాన్స్ తో చెప్పను బ్రదర్ వివాదం నుంచి మాత్రం   బయటకు రాలేకపోతున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఓపెన్ గానే వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కు తన అండ ఏ స్థాయిలో ఉందో రంగస్థలం సక్సెస్ మీట్ లో చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇది బన్నీ క్యాంప్ ను కాస్త కలవరపాటుకు గురి చేసే విషయమే. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ లో పెద్ద విజయాలు సాధించిన ఘనత బన్నీకి ఉన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డులతో పాటు మెగాస్టార్ రికార్డును కూడా దాటేసి రామ్ చరణ్ సత్తా చాటాడు.

ఇలాంటి సమయంలో మరో రెండున్నర వారాల్లో అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య వస్తోంది. పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకతను ఎదుర్కోవడం ఇప్పుడు బన్నీకి చాలా అవసరం. అసలు పవన్ తో ఓ కలయిక ద్వారా.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వ్యతిరేకత నుంచి పర్మినెంట్ గా బయటకు రావచ్చు. ఇప్పటికే మెగాస్టార్ ను సెట్స్ కు ఆహ్వానించగా.. ఇప్పుడు బన్నీ అదే ట్రయల్స్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English