ఆడియన్స్ కు బాగా బోర్ కొడుతోంది

ఆడియన్స్ కు బాగా బోర్ కొడుతోంది

ఏ సినిమాకు అయినా రొటీన్ అనే టాక్ వస్తే చాలు.. ఇక ఆ మూవీ పరిస్థితి అంచనా వేయడం కూడా కష్టం అయిపోతోంది. ఏదో ఒకటి కొత్తగా ట్రై చేశారనే టాక్ లేకపోతే మాత్రం సినిమాను తిరస్కరించేందుకు ఆడియన్స్ ఏ మాత్రం సంశయించడం లేదు.

స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఆగడు అంటూ మహేష్ బాబు రొటీన్ కమర్షియల్ సినిమా ట్రై చేస్తే నిర్దాక్షిణ్యంగా తిరగ్గొట్టారు ప్రేక్షకులు. బ్రహ్మోత్సవం అంటూ గతంలో చూపించిన మెలోడ్రామానే మళ్లీ తిప్పి తిప్పి చూపించేందుకు ట్రై చేస్తే వర్కవుట్ కాలేదు. స్పైడర్ కూడా రొటీన్ సినిమా మాత్రమే. అందుకే ఇది కూడా జనాలకు అస్సలు ఎక్కలేదు. శ్రీమంతుడు విషయానికి వచ్చేసరికి కంటెంట్ కొత్తగా ఉంది.. అందుకే ప్రేక్షకులకు ఎక్కింది.. రికార్డులను నమోదు చేసింది. నాని విషయంలో కూడా ఇలంటి పరిస్థితే కనిపిస్తోంది. వరుసగా ఏదో ఒక కొత్త కంటెంట్ చూపిస్తున్నాడనే నమ్మకంతో.. ఎంసిఎ వంటి రెగ్యులర్ సినిమాను కూడా ఆడించారు.

కాని.. అలాంటి రొటీన్ మసాలాను మాత్రమే మళ్లీ ట్రై చేయడమే.. కృష్ణార్జున యుద్దంకు పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. నాని నుంచి పక్కా మాస్ సినిమాను అసలు జనాలు ఎక్స్ పెక్ట్ కూడా చేయలేదు. అందుకే న్యాచురల్ స్టార్ సెలక్షన్ తో ప్రేక్షకులు ఏకీభవించలేదు. చివరకు ఫలితం ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. ఏతావాతా జనాలకు కొత్తదనం అందించకపోతే మాత్రం.. హీరో ఎవరైనా సరే.. సినిమా ఫలితం గాల్లో దీపమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English