మలయాళ సినిమా.. మెరుపులే

మలయాళ సినిమా.. మెరుపులే

జాతీయ అవార్డులు ప్రకటించారంటే మన వాళ్ల చూపులు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం కేటగిరీ మీదే ఉంటుంది. చాలా ఏళ్లుగా మనకు అవార్డు వస్తున్నది ఆ విభాగంలో మాత్రమే. కొన్నిసార్లు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికయ్యే అర్హతను కూడా మన సినిమాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ఐతే గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ‘బాహుబలి’ లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి. ఐతే వచ్చే ఏడాది నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో? మళ్లీ ‘రీజనల్’ కేటగిరీ మీదే దృష్టిపెట్టాల్సి వస్తుందేమో చూడాలి. ఐతే సౌత్ ఇండియాలో ఇంతకుముందు జాతీయ అవార్డుల్లో హవా సాగించిన తమిళ సినిమా గత కొన్నేళ్లలో వెనుకబడిపోయింది.

కానీ మలయాళ సినిమా మాత్రం ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోతోంది. మలయాళ సినిమాల పరిధి తక్కువ. వసూళ్లు తక్కువ. కానీ కంటెంట్ విషయంలో మాత్రం వాళ్లను కొట్టేవాళ్లు సౌత్ ఇండియాలో ఎవ్వరూ లేరు. ఆ మాటకొస్తే ఇండియాలోనే అద్భుతమైన కంటెంట్‌ తో సినిమాలు తీస్తున్నది.. భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కిస్తున్నది మలయాళ సినిమాలే అంటే అతిశయోక్తి లేదు.

కొన్నేళ్లుగా జాతీయ అవార్డులు ప్రకటించిన ప్రతిసారీ హవా మలయాళ సినిమాదే అవుతోంది. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. దిలీప్ పోతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొండిముత్తలుమ్ ద్రిక్ష్యాక్షున్యమ్’ సినిమాకు ఫాహద్ ఫాజిల్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ చిత్రానికే సాజివ్ ఫజోర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కించుకున్నాడు. ఇది ఉత్తమ మలయాళ చిత్రంగానూ నిలిచింది. ఇక ‘భయానకం’ అనే సినిమాకు గాను జయరాజ్ జాతీయ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ‘టేకాఫ్’ చిత్రానికి పార్వతి ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ పురస్కారం అందుకుంది. జాతీయ అవార్డుల ప్రకటన సందర్భంగా ఈ మూడు చిత్రాలనూ జ్యూరీ సభ్యులు ప్రశంసించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English