ఆ సినిమాకు దిల్ రాజు సర్టిఫికెట్ ఇచ్చేశాడు

 ఆ సినిమాకు దిల్ రాజు సర్టిఫికెట్ ఇచ్చేశాడు

గత దశాబ్ద కాలంలో పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాలు తీశాడో అందరికీ తెలిసిందే. వక్కంతం వంశీ కథతో చేసిన ‘టెంపర్’ మినహాయిస్తే ఆయన్నుంచి స్థాయికి తగ్గ సినిమాలే రాలేదు గత పదేళ్లలో. ఐతే కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పెట్టి ఆయన తీసిన ‘మెహబూబా’ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇది కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది.

దీని టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. దీనికి తోడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి దిల్ రాజు ముందుకు రావడంతో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. పూరి ఈజ్ బ్యాక్ అనేశాడు.

కొన్ని నెలల కిందట ‘మెహబూబా’ టీజర్ చూసి డిఫరెంట్‌గా, బాగుందే అని అనుకున్నానని.. ఐతే కొన్ని రోజుల తర్వాత ఛార్మి తన వాళ్లకు ఫోన్ చేసి సినిమా చూడమని చెప్పిందని.. ప్రివ్యూ ఏర్పాటు చేయమంటే 15 రోజుల తర్వాత అందుకు సన్నాహాలు చేశారని దిల్ రాజు వెల్లడించాడు. ఐతే సినిమాకు వెళ్లే ముందు తాను భయం భయంగానే ఉన్నట్లు రాజు చెప్పాడు. పూరి గతంలో అద్భుతమైన సినిమాలు తీశాడని.. స్టార్ హీరోలకు మంచి విజయాలు అందించాడని... అతను ఫెంటాస్టిక్ డైరెక్టర్ అని.. మంచి కథ రాస్తే దాన్ని అద్భుతంగా తీస్తాడని.. కానీ ఆ కథ రాయకపోవడం వల్లే ఫెయిల్యూర్లు వచ్చాయని దిల్ రాజు అభిప్రాయపడ్డాడు.

ఇక ‘మెహబూబా’ ఫస్టాఫ్ చూశాక బాగుందనిపించిందని.. ఐతే ద్వితీయార్ధం చూసే ఏ నిర్ణయమైనా తీసుకోవాలనుకున్నానని.. ఐతే క్లైమాక్స్‌కి ముందు పవర్ పోయిందని.. ఛార్మి పవర్ వచ్చేదాకా వెయిట్ చేద్దామని అన్నప్పటికీ తాను మాత్రం ఉత్సుకతతో ల్యాప్ టాప్‌లోనే క్లైమాక్స్ చూడటానికి రెడీ అయ్యానని.. అలాగే చూశానని.. మొత్తంగా సినిమా చాలా బాగా నచ్చిందని రాజు చెప్పాడు. సినిమా అయ్యాక ఇది కదా పూరి అంటే అనిపించిందని.. మంచి కథను అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చాలా బాగా తీశాడని.. అన్ని రకాలుగా సినిమా బాగుండటంతో తాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చానని రాజు అన్నాడు. రేప్పొద్దున తనకు కలిగిన ఫీలింగే జనాలకు కూడా కలుగుతుందని రాజు ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English