పూనమ్‌ కౌర్‌ తెలిసే నాటకాలు ఆడుతోందా?

పూనమ్‌ కౌర్‌ తెలిసే నాటకాలు ఆడుతోందా?

పవన్‌కళ్యాణ్‌కి, పూనమ్‌ కౌర్‌కి మధ్య సంబంధం వుందంటూ, తన దగ్గర ఆధారాలున్నాయంటూ కత్తి మహేష్‌ అప్పట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి నిజంగానే వారి మధ్య ఏదైనా వుందా అని జనం ఆసక్తిగా చూస్తూ వస్తున్నారు. మీడియాని, జనాల దృష్టిని ఆకర్షించడానికి పూనమ్‌ కౌర్‌ కూడా పవన్‌ గురించి మాట్లాడుతోందా అన్నట్టు పరోక్ష విమర్శలు చాలానే చేసింది.

ఈ నేపథ్యంలో ఏబిఎన్‌ ఛానల్‌ పూనమ్‌ కౌర్‌తో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూకి 'పంజాబి పంజా' అనే పేరు పెట్టి పంజాకి బదులు పవన్‌ నటించిన సినిమా లోగో వేసి, ఇంటర్వ్యూ తాలూకు ప్రోమోలో పవన్‌ గురించి చాలా సీక్రెట్స్‌ చెప్పేసిందనే భ్రమ కలిగించేట్టు ప్రసారం చేసి ఆసక్తి రాబట్టింది. అయితే నిజానికి ఆ ఇంటర్వ్యూలో పూనమ్‌ చెప్పిన పనికొచ్చే సంగతులు కానీ, సంచలనాత్మక విషయాలు కానీ ఏమీ లేవు. ఏదో పిచ్చా పాటీగా మాట్లాడుతూ అడపాదడపా కొన్ని మాటలు మాత్రం లోతుగా పరిశీలించాలన్నట్టు మాట్లాడింది.

అయితే పూనమ్‌ మాట్లాడే దానిని పవన్‌ గురించే అనుకోవడానికి లేదు. నిజానికి కత్తి మహేష్‌ తన క్యారెక్టర్‌ అసాసినేషన్‌ చేస్తోంటే పవన్‌ తరఫున ఎవరూ మాట్లాడలేదనే వేదనే ఆమె మాటల్లో ధ్వనించింది. ఆమె మాట్లాడే ప్రతి మాటా కత్తి మహేష్‌ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టే వున్నా, మరోలా ఆలోచిస్తే పవన్‌ గురించి మాట్లాడుతోందా అనిపించేట్టున్నాయి. పూనమ్‌ ప్రతి విషయంలోను ఇలా డొంక తిరుగుడు చూపిస్తూనే వుంది. ఇదంతా చూస్తుంటే సెన్సేషనలిజమ్‌ కోసం, అటెన్షన్‌ కోసం చేస్తున్నదేమో అనే అనుమానాలొస్తున్నాయి. తను మాట్లాడేది పవన్‌కి అన్వయించుకుంటారని తెలిసే పూనమ్‌ ఇలా నాటకాలు ఆడుతోందా అని ఆమె ఇంటర్వ్యూ చూసిన వాళ్లలో చాలా మంది సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించడం కనిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English