మహేష్‌కిచ్చిన ప్రామిస్‌ నిలబెట్టేసుకుంటున్నాడు

మహేష్‌కిచ్చిన ప్రామిస్‌ నిలబెట్టేసుకుంటున్నాడు

చేసిన ప్రామిస్‌కి కట్టుబడి వుండాలనేది మహేష్‌ నటించిన 'భరత్‌ అనే నేను' థీమ్‌. ప్రామిస్‌... అంటూ మహేష్‌ డైలాగులు అభిమానులని ఉర్రూతలూగిస్తూ వుంటే, మహేష్‌కి చేసిన ప్రామిస్‌ నిలబెట్టుకునేందుకు సుకుమార్‌ డిసైడయ్యాడు. తన తదుపరి చిత్రంపై వున్న సస్పెన్స్‌ తొలగించి మహేష్‌తో సినిమాకి కమిట్‌ అయ్యాడు.
రంగస్థలం తర్వాత సుక్కూ ఎవరితో చేస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. '1 నేనొక్కడినే' చిత్రంతో మహేష్‌కి పరాజయాన్నిచ్చిన సుకుమార్‌ దానికి బదులుగా మరో సినిమా చేసి విజయాన్ని ఇస్తానని అప్పట్లోనే మాట ఇచ్చాడు. తనో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన తర్వాత, తనకోసం చాలా మంది హీరోలు క్యూ కడుతోన్న టైమ్‌లో అందరినీ కాదని మహేష్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఈ చిత్రం కోసం సుకుమార్‌ ఇంకా కథ రెడీ చేసుకోలేదు. రెండు, మూడు ఐడియాలున్నాయి కానీ వాటిలో ఏది చేయాలనేది ఇంకా డిసైడ్‌ అవలేదు.

మహేష్‌కి ఎలాగో తదుపరి చిత్రం ముందే రెడీగా వుంది. వంశీ పైడిపల్లితో ఇరవై అయిదవ చిత్రం చేసిన తర్వాత మహేష్‌ వచ్చి సుకుమార్‌తో జాయిన్‌ అవుతాడు. వచ్చే యేడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లే అవకాశముంది. మరి మహేష్‌తో రీడిఫైన్డ్‌ ఇమేజ్‌తో సుకుమార్‌ చేసే సినిమా ఎలా వుంటుందనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English