బాహుబలి నష్టంతో భరత్‌ జాగ్రత్త

బాహుబలి నష్టంతో భరత్‌ జాగ్రత్త

ఓవరాల్‌ కలక్షన్లు చూసి బాహుబలి చిత్రం కొన్నవాళ్లంతా హ్యాపీ అని అపోహ పడుతుంటారు. నిజానికి చిన్న సెంటర్స్‌ కొన్నిట్లో అంతటి ఘన విజయం సాధించిన చిత్రానికి కూడా థర్డ్‌ పార్టీల వారికి నష్టాలు తప్పలేదు. ముఖ్యంగా యుఎస్‌లో కనిపించిన ప్రతి థియేటర్‌లోను బాహుబలి 2 స్క్రీన్‌ చేసేసారు. చిన్న చిన్న ఊర్లలో సరిపడా కెపాసిటీ లేక సదరు బయ్యర్లకి ఖర్చులు కూడా రాలేదు. కొన్ని కాస్ట్‌లీ థియేటర్లలో షో వేస్తే భారీ స్థాయిలో గ్రాస్‌ వసూలు కాకపోతే కొన్నవారికి ఖర్చులు కూడా తిరిగి రావు. ఆ అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని భరత్‌ అనే నేను రిలీజ్‌ చేస్తోన్న గ్రేట్‌ ఇండియా ఫిలింస్‌ సంస్థ ఈ చిత్రానికి తక్కువ లొకేషన్లు ప్లాన్‌ చేస్తోంది.

320 లొకేషన్లలోనే షోస్‌ వేస్తుండేసరికి మరిన్ని చోట్ల వేయాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఎవరికైనా షో వేసుకోవాలనుంటే కొనుక్కుని వేసుకోవచ్చునని, లొకేషన్‌ అందుబాటులో వుంది కదా అని అన్ని థియేటర్లలో వేయలేమని, బాహుబలి 2 అనుభవం నుంచి ఏ లొకేషన్‌ బెస్ట్‌ అనేది ఐడెంటిఫై చేసి విడుదల చేస్తున్నామని, ఔత్సాహికులు ఎవరైనా వుండి తమ ప్రాంతంలో షో వేయాలని అనుకుంటే తప్పకుండా తగిన మొత్తం చెల్లించి వేసుకోవచ్చునని ఆ సంస్థ పేర్కొంది. ఓవరాల్‌గా వచ్చే గ్రాస్‌ వసూళ్ల కోసం కాకుండా నష్టాలు రాకుండా థియేటర్‌ యావరేజ్‌ చూసుకుని విడుదల చేయడం శుభ పరిణామమే. అందుకే ఈ చిత్రానికి బాహుబలి 2 స్థాయి వసూళ్లు వస్తాయని అంచనాలు పెట్టుకోకుండా 'రంగస్థలం' రికార్డులని టార్గెట్‌ చేసుకుంటే అందరూ హ్యాపీస్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English