అలసిపోయా... రెస్ట్‌ కావాలి

అలసిపోయా... రెస్ట్‌ కావాలి

'భరత్‌ అనే నేను' తర్వాత కొరటాల శివ ఏ హీరోతో చేస్తాడనే సస్పెన్స్‌ సినీ అభిమానులకి ఉత్కంఠ రేపుతోంది. వరుసగా భారీ విజయాలని సాధిస్తోన్న కొరటాల శివ 'భరత్‌ అనే నేను' కోసం ఏడాది పైగా శ్రమించాడు. తదుపరి చిత్రమేంటని అడిగితే ఇంకా ఆలోచించుకోలేదని, నాలుగు సినిమాల మధ్య గ్యాప్‌ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల బాగా అలసిపోయానని, కనీసం రెండు నెలల పాటు ఏ కథ గురించి ఆలోచించనని, ఆ తర్వాత పుస్తకాలు చదివి పునరుత్తోజంతో తిరిగి వస్తానని కొరటాల చెప్పాడు.

పెద్ద హీరోతో వుంటుందా లేక ఎవరైనా యువ హీరోతో చేస్తారా అని అడిగితే వరుసగా పెద్ద హీరోలతో చేసి ఫ్రెష్‌నెస్‌ అయితే కోరుకుంటున్నానని, అయితే ఇంకా ఎలాంటి సినిమా చేయాలనే దానిపై నిర్ణయించుకోలేదని తెలిపాడు. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరితో విడివిడిగా కమిట్‌మెంట్స్‌ వున్నా కూడా వాళ్లిద్దరూ రాజమౌళి సినిమాతో బిజీ కావడంతో కొరటాలకి ప్రస్తుతం హీరో లేడు. అఖిల్‌తో సినిమా అనుకున్నారు కానీ అది మెటీరియలైజ్‌ కాలేదు. అల్లు అర్జున్‌ లేదా ప్రభాస్‌తో వుండవచ్చునని వినిపిస్తున్నా వాళ్లిద్దరి తదుపరి ప్లాన్స్‌ ఏమిటనేది ఇంకా తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English