పాత సినిమాకు ఫుల్.. కొత్త సినిమా డల్

పాత సినిమాకు ఫుల్.. కొత్త సినిమా డల్

నేచురల్ స్టార్ నాని గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు. అతడి సినిమా వస్తోందంటే వేరే సినిమాల నిర్మాతలు భయపడే పరిస్థితి వస్తోంది. పెద్ద స్టార్లు కూడా అతడిని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. రెండు వారాల ముందు ‘రంగస్థలం’.. తర్వాతి వారం ‘భరత్ అనే నేను’ బరిలో ఉన్నా సరే ఏప్రిల్ 12కు తన కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ను ధీమాగా రేసులో నిలిపాడు నాని. ఇది థియేటర్లలోకి దిగితే ‘రంగస్థలం’ వసూళ్లు కచ్చితంగా తగ్గుముఖం పడతాయని.. దాదాపుగా ఆ చిత్ర థియేట్రికల్ రన్‌కు తెరపడుతుందని అనుకున్నారు ట్రేడ్ పండిట్లు. కానీ ఆ అంచనాలు తప్పాయి. ‘రంగస్థలం’ దెబ్బకే ‘కృష్ణార్జున యుద్ధం’ కుదేలవుతోంది.

నాని చివరి సినిమా ‘ఎంసీఏ’కు ఎంత డివైడ్ టాక్ వచ్చినా సరే.. తొలి వారాంతంలో భారీ వసూళ్లు రాబట్టింది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్‌తో నడిచింది. కానీ ‘కృష్ణార్జున యుద్ధం’ విషయంలో అలా జరగట్లేదు. తొలి రోజే చాలా చోట్ల 50-60 శాతం ఆక్యుపెన్సీతో నడిచిన ఈ సినిమా వీకెండ్లో కూడా పుంజుకోలేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో శని, ఆదివారాల్లో యావరేజ్ సినిమాలకు కూడా ఫుల్స్ పడుతుంటాయి. అందులోనూ శనివారం ఫస్ట్, సెకండ్ షోలకు కొత్త సినిమాకు కచ్చితంగా ఫుల్స్ పడాల్సిందే. కానీ ‘కృష్ణార్జున యుద్ధం’కు మాత్రం హాల్ నిండలేదు. కానీ రెండు వారాల ముందు సినిమా ‘రంగస్థలం’కు మాత్రం ఫుల్స్ పడ్డాయి. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆదివారానికి ‘రంగస్థలం’ టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఫుల్స్ చూపిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English