సౌత్ ముందు బాలీవుడ్ వేస్టనేసిన లెజెండ్

సౌత్ ముందు బాలీవుడ్ వేస్టనేసిన లెజెండ్

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. వేరే దేశాల వాళ్లు అలాగే చూసేవాళ్లు. ఉత్తరాది వాళ్లు కూడా అలాంటి ఉద్దేశంతోనే ఉండేవాళ్లు. సౌత్ సినిమాను వాళ్లు చాలా తక్కువగా చూసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో సీన్ మారింది. సౌత్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ‘రోబో’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలు సౌత్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. కేవలం గ్రాండియర్ విషయంలోనే కాదు... కంటెంట్ పరంగానూ దక్షిణాది సినిమా ఎంతో ఎదిగింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ప్రముఖులు కూడా గుర్తిస్తున్నారు. సౌత్ సినిమా నుంచి పాఠాలు నేర్వాల్సిన వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. ‘బాహుబలి’ చూసి బాలీవుడ్ లెజెండ్స్ ఎందరో ఫిదా అయిపోయారు. అందులో శేఖర్ కపూర్ కూడా ఒకడు.

హాలీవుడ్లోనూ సినిమాలు తీసి మెప్పించిన శేఖర్.. 2017 జాతీయ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా దక్షిణాది నుంచి వచ్చిన సినిమాల్లో కథాంశాలు.. వైవిధ్యం చూసి స్టన్ అయిపోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాలు సౌత్ ఇండస్ట్రీ విషయంలో తన అభిప్రాయాల్ని మార్చేశాయని.. తన కళ్లు తెరిపించాయని శేఖర్ అన్నాడు. ఆ సినిమాలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయని.. ‘రీజనల్ సినిమా’ అనే ట్యాగ్‌ను ఇక తీసేయాల్సిన అవసరం ఉందని.. హిందీ సినిమా వీటితో ఎంతమాత్రం పోటీ పడే స్థితిలో లేదని ఆయన అనడం విశేషం. శేఖర్ కపూర్ లాంటి లెజెండ్ సౌత్ సినిమా గురించి ఈ రేంజిలో పొగడ్తలు గుప్పించడం విశేషమే. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో సౌత్ సినిమాలకు పెద్ద సంఖ్యలోనే అవార్డులొచ్చిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English