మహేష్ నవ్వు చూసి చేయడనుకున్నాడట

మహేష్ నవ్వు చూసి చేయడనుకున్నాడట

రాజకీయాల మాటెత్తితే చాలు చేతులెత్తి మొక్కేస్తుంటాడు మహేష్ బాబు. చిన్న కామెంట్ చేయడానికి కూడా భయపడుతుంటాడు. పాలిటిక్స్ గురించి తనకు జీరో నాలెడ్జ్ అని చెప్పి తప్పించుకుంటుంటాడు. అలాంటి వాడు పూర్తి స్థాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమాలో నటించాడు. ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. మరి ఇలాంటి పాత్ర.. ఇలాంటి సినిమా గురించి చెప్పినపుడు మహేష్ రియాక్షనేంటి..? ఆ సంగతులే ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ పంచుకున్నాడు.

‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోది ముఖ్యమంత్రి పాత్ర అనగానే మహేష్ గట్టిగా నవ్వాడట. ఆ నవ్వు చూస్తే ఈ సినిమా చేయను అని మహేష్ అంటాడేమో అనిపించిందని కొరటాల చెప్పాడు. నేనేంటి.. సీఎం ఏంటి అని మహేష్ అడిగాడని కూడా వెల్లడించాడు. మహేష్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అని.. పాలిటిక్స్‌ను పెద్దగా ఫాలో అవ్వడని.. అయినప్పటికీ తనకు మాత్రం ఈ కథకు మహేషే యాప్ట్ అనిపించిందని.. ఆ విషయమే మహేష్‌తో కాన్ఫిడెంట్‌గా చెబితే సినిమా ఓకే చేశారని కొరటాల తెలిపాడు. యాక్టర్‌గా తనకు కొత్తగా,ఛాలెంజింగ్‌గా ఉంటుందన్న ఉద్దేశంతోనే మహేష్ ఈ సినిమా ఒప్పుకున్నాడని.. కేక్ వాక్ లాగా ఉండే క్యారెక్టర్లు మహేష్‌కు ఇష్టం ఉండవని.. ఛాలెంజ్‌ల కోసమే అతనెప్పుడూ చూస్తాడని కొరటాల అన్నాడు. వర్తమాన రాజకీయాల నేపథ్యంలో సినిమా అంటే లేని పోని వివాదాలొస్తాయనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి కాలమానం నేపథ్యంలో ఓ కల్పిత కథతో8 సినిమా తీసినట్లు కొరటాల తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English