సుమంత్ హీరోయిన్.. నాగార్జున సరసన

సుమంత్ హీరోయిన్.. నాగార్జున సరసన

టాలీవుడ్లో ఒకే ఫ్యామిలీలోని హీరోల మధ్య హీరోయిన్లు ఎక్స్ ఛేంజ్ కావడం అన్నది ఎప్పట్నుంచో ఉంది. అక్కినేని కుటుంబంలో ఏఎన్నార్ సరసన నటించిన శ్రీదేవి ఆ తర్వాత నాగార్జునతో జత కట్టింది. అలాగే అక్కినేని నాగార్జున-సుమంత్ ఇద్దరితోనూ భూమిక.. స్నేహ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ ముందు సుమంత్ తో నటించి ఆ తర్వాత నాగార్జునతో జోడీ కట్టారు. ఇప్పుడు ఇదే కోవలో మరో కథానాయిక ముందు సుమంత్ కు జోడీగా కనిపించి ఇప్పుడు నాగార్జున సరసన నటించబోతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘మళ్ళీ రావా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆకాంక్ష సింగ్.

ఈ బాలీవుడ్ భామ తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించింది. ఆమెకు రెండో అవకాశం నాగార్జున సినిమాలో రావడం విశేషం. ప్రస్తుతం నాగ్.. నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథానాయికలు కన్ఫమ్ అయ్యారు. నాగ్ సరసన ఆకాంక్ష నటించబోతుండగా.. నానితో ‘ఛలో’ భామ రష్మిక మండాన్నా జత కట్టబోతోంది. ఈ చిత్రం రెండు వారాల కిందట చిత్రీకరణ మొదలు పెట్టుకుంది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ్-నాని అన్నదమ్ములుగా నటిస్తుండటం విశేషం. నాగ్ డాన్ పాత్రలో కనిపించనుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు