టాలీవుడ్ టైగర్ లా తయారవుతున్నాడు

టాలీవుడ్ టైగర్ లా తయారవుతున్నాడు

యాక్షన్ కంటెంట్ కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కానీ.. సినిమాలో ఈ అంశాన్ని ఓ మోస్తరు వరకు పరిమితం చేస్తారు. యాక్షన్ మూవీ అనే ట్యాగ్ ఇచ్చినా.. ఇండియాలో కంప్లీట్ గా ఆ జోనర్ తోనే సినిమాలు చేయడం.. మూవీలో మూడొంతులు అవే ఎపిసోడ్స్ ఉండడం.. విపరీతంగా బాడీ బిల్డప్ చేయడం వంటివి.. మనకు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇదే రూటులో ఒక తెలుగు హీరో కూడా నడుస్తున్నాడు సుమీ!

టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండింగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హీరో రేంజ్ సక్సెస్ తో పాటు క్రేజ్ కూడా సంపాదించుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు టాక్సీవాలా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభం కాగా.. ఈ నెల 17న టీజర్ విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో అన్నిటికంటే ఆకట్టుకునే పాయింట్ విజయ్ దేవరకొండ అనడంలో ఆశ్చర్యం లేదు.

తెలుగు హీరోలు బాడీ బిల్డప్ చేసి సిక్స్ ప్యాక్ లు చూపించడం కొత్తేమీ కాదు కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో చాలా అడుగులు ముందుకు వెళ్లాడని అనిపించక మానదు. మూవీ కూడా యాక్షన్ జోనర్ లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బాడీ బిల్డప్ లు.. ఎంచుకుంటున్న సబ్జెక్టులు చూస్తుంటే.. రొమాన్స్ ను ఆన్ స్క్రీన్ పై నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లడం వంటివి చూస్తుంటే.. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్ నుంచి వచ్చిన సినిమాల మాదిరిగా.. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండ నుంచి మూవీస్ ఎక్స్ పెక్ట్ చేసేయచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు