సామ్ సాధిస్తున్న అరుదైన ఘనత

సామ్ సాధిస్తున్న అరుదైన ఘనత

ఏ యాక్టర్ కి అయినా.. ఒకే తరహాగా ఉండే పాత్రలను రిపీట్ చేస్తుండడం కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఒకే తరహాగా కూడా కూడా కాదు.. ఒకే పాత్రను చేయడం అంటే మొనాటనీ అనిపిస్తుంది. అదే వరుసగా రెండు సినిమాల్లో ఒకటే క్యారెక్టర్ ను పోషించడం అంటే.. అది విచిత్రంగా కనిపించవచ్చు. హీరోలకే కాదు.. హీరోయిన్లకు ఇలాంటివి అస్సలు కనిపించవు.

కానీ టాలీవుడ్ బ్యూటీ సమంత మాత్రం ఈ అరుదైన ఘనతను సాధించబోతోంది. రంగస్థలం మూవీతో టాలీవుడ్ జనాలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన సమంత.. ఇప్పుడు మహానటి మూవీలో మధురవాణి పాత్రతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సమంత 80ల కాలం నాటి జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం ఇప్పటికే చెప్పేశారు. ఈమె లుక్ ను కూడా రివీల్ చేశారు. ఇదిలా ఉంటే.. మహానటి తర్వాత సమంత నుంచి రాబోయే మూవీ యూ-టర్న్. సమంత తను ఎంతో ఇష్టపడి.. తనే స్వయంగా అప్రోచ్ అయ్యి మరీ ఈ కన్నడ రీమేక్ ను చేస్తోంది.

విచిత్రం ఏంటంటే.. యు-టర్న్ మూవీలో కూడా సమంత జర్నలిస్ట్ రోల్ లోనే కనిపించబోతోంది. ఓ ఫ్లై ఓవర్ మీద జరిగిన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి గురించి రీసెర్చ్ చేసే జర్నలిస్ట్ గా సమంత నటిస్తోంది. ఆ ప్రమాదం గురించి రీసెర్చ్ చేస్తూ.. తనే ప్రమాదంలో పడిపోయే పాత్రికేయురాలి రోల్ ఇది. అంటే అటు మహానటి.. ఆ తర్వాత వెంటనే వచ్చే యు-టర్న్.. ఈ రెండు సినిమాల్లోను జనర్నలిస్ట్ పాత్రలోనే నటించి మెప్పించాల్సి ఉంటుందన్న మాట. కాకపోతే.. ఒకటి పీరియాడిక్ మూవీ.. రెండోది ఇప్పటి జనరేషన్ కాబట్టి.. కచ్చితంగా డిఫరెన్స్ చూపిస్తుందిలెండి. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు